TODAY CURRENT AFFAIRS IN TELUGU 26th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 26th FEBRUARY 2024

1) ఆసియా కప్ ఆర్చరీ పోటీలలో మూడు స్వర్ణాలు కైవసం చేసుకున్న భారత ఆటగాడు ఎవరు.?
జ : బొమ్మదేవర ధీరజ్

2) తన పదవికి రాజీనామా చేసిన పాలస్తీనా ప్రధానమంత్రి ఎవరు.?
జ : మహ్మద్ ష్టయ్యో

3) తెలంగాణలోని ఏ జిల్లాలో సుమారు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం నాటి మొక్కల శిలాజాలను గుర్తించారు.?
జ : ఆసిఫాబాద్ జిల్లా

4) ఏ దేశ సైన్యంలో సహాయకులుగా పనిచేస్తున్న భారత సైనికులను వెనక్కి పిలిపిస్తున్నట్లు భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.?
జ : రష్యా

5) గాయపడిన జంతువులను రక్షించడం, చికిత్స అందించడం కోసం మూడు వేల ఎకరాలలో గుజరాత్ లోని జామ్ నగర్ లో ఏ పేరుతో రిలయన్స్ ఇండస్ట్రీ కృత్రిమ అడవిని సృష్టించింది.?
జ : వన్ తారా

6) ఇంగ్లాండ్ మీద టెస్ట్ సిరీస్ విజయంతో వరుసగా స్వదేశంలో ఎన్ని టెస్టు సిరీస్ లు విజయం సాధించి, అగ్రస్థానంలో భారత్ నిలిచింది.?
జ : 17 టెస్ట్ సిరీస్ లు (ఆస్ట్రేలియా – 10)

7) మొదటి ఎనిమిది టెస్టుల్లో అత్యధిక పరుగులు (971) చేసిన భారత బ్యాట్స్మెన్ గా ఇటీవల ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : యశస్వీ జైస్వాల్ (గవాస్కర్ 938)

8) మొదటి ఎనిమిది టెస్టుల్లో అంతర్జాతీయంగా అత్యధిక పరుగులు (971) చేసిన రెండో ఆటగాడిగా ఎవరు నిలిచారు.?
జ : యశస్వీ జైస్వాల్ (మొదటి స్థానంలో డాన్ బ్రాడ్‌మన్ – 1210)

9) పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు.?
జ : మరియం నవాజ్

10) టెక్సాస్ అత్యున్నత అకాడమిక్ అవార్డు అయినా ‘ఎడిత్ & పీటర్ ఓడన్నెల్ పురస్కారం ఏ ప్రవాస భారతీయుడికి దక్కింది.?
జ : ప్రొ. ఆశోక్ వీరరాఘవన్

11) చంద్రుడిపై 14 రోజుల రాత్రిని తట్టుకొని తిరిగి స్పందించిన జపాన్ ల్యాండర్ పేరు ఏమిటి?
జ : స్లిమ్

12) పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ పదవికి ఎవరు రాజీనామా చేశారు.?
జ : విజయ్ శేఖర్ వర్మ

13) దేశంలోనే అతి పొడవైన (2.3 కిలోమీటర్ల) తీగల వంతెనను ఇటీవల నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ తీగల వంతెన పేరు ఏమిటి.?
జ : సుదర్శన సేతు

14) ఏసియా ఆర్చరీ కప్ 2024 లో భారత్ ఎన్ని పథకాలు గెలుచుకుంది.?
జ : 14 (G -9, S-4 , B- 1)

15) ప్రపంచంలోనే తొలి వేద గడియారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మార్చి ఒకటవ తేదీన ఏ నగరంలో ప్రారంభించనున్నారు.?
జ : ఉజ్జయిని (మధ్యప్రదేశ్)

16) 21వ బయోడ ఏషియా సదస్సు 2024 ఏ నగరంలో ప్రారంభమైంది.?
జ : హైదరాబాద్

17) 21వ బయోడ ఏషియా సదస్సు 2024 యొక్క థీమ్ ఏమిటి.?
జ : DATA – AI – RE DESIGNING POSSIBILITIES

18) నాటోలో 32వ దేశంగా సభ్యత్వం పొందిన దేశంగా ఏ దేశం నిలిచింది.?
జ : స్వీడన్