TODAY CURRENT AFFAIRS IN TELUGU 26th APRIL 2024
1) అమెరికా, వెస్టిండీస్ లలో జరగనున్న టి20 ప్రపంచ కప్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితుడైన భారత మాజీ క్రికెటర్ ఎవరు.?
జ : యువరాజ్ సింగ్
2) ప్రపంచ టి20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సిక్సులు నమోదైన (42) మ్యాచ్ ఏది.?
జ : KKR vs PBKS
3) ప్రపంచ టి20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులను సేదించిన జట్టుగా ఏ జట్టు నిలిచింది.?
జ : పంజాబ్ కింగ్స్ (261)
4) ఆర్బిఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తాజాగా రచించి, విడుదల చేసిన పుస్తకం పేరు ఏమిటి.?
జ : జస్ట్ ఏ మెర్సినరీ – నోట్స్ ప్రమ్ మై లైఫ్ & కెరీర్
5) ఇటీవల చైనా తన అంతరిక్ష కేంద్రంలోకి ముగ్గురు హ్యొమోగాములను పంపింది. ఆ అంతరిక్ష కేంద్రం పేరు ఏమిటి.?
జ : తియాంగాంగ్
6) డెలాయిట్ అంచనాల ప్రకారం 2024 – 25 లో భారత జిడిపి వృద్ధిరేటు ఎంత.?
జ : 6.6%
7) ఏ సంస్థ తన హర్లిక్స్ డ్రింక్ కు ఉన్న హెల్త్ డ్రింక్ ట్యాగ్ ను తొలగించింది.?
జ : హిందుస్థాన్ యూనివర్సల్ లిమిటెడ్
8) దక్షిణాదిలో నీటి రిజర్వాయర్లలో నీటి నిల్వ శాతం ఎంతకు పడిపోయిందని కేంద్ర జల సంఘం ప్రకటించింది.?
జ : 17 శాతానికి
9) ఈ రెండు దేశాల మధ్య తాజాగా ఐదు సూత్రాల ఒప్పందం కుదిరింది.?
జ : అమెరికా – చైనా
10) ఎండు టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాల్సి వస్తే భారత్ నుండి వైదొలుగుతామని ఏ సోషల్ మీడియా సంస్థ ప్రకటించింది.?
జ : వాట్సాప్
11) ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పోలింగ్ యూనిట్ లను ఎన్ని రోజులు సీలింగ్ వేసి భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.?
జ : 45 రోజులు
12) యుధ్‌వీర్ పురస్కారానికి ఎవరు ఇటీవల ఎంపికయ్యారు.?
జ : శ్రీదేవి ప్రసాద్ (శంకర్ పౌండేషన్)