TODAY CURRENT AFFAIRS IN TELUGU 24th MAY 2024
1) తైవాన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : లైచింగ్ తే
2) WEF – ప్రయాణ – పర్యాటక అభివృద్ధి సూచీ 2024 లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 39
3) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన అంతరిక్ష అబ్జర్వేటరీని ఎక్కడ నిర్మిస్తున్నారు.?
జ : అటకామా (సముద్ర మట్టానికి 5,640 మీటర్ల ఎత్తు)
3) భారత్ లో గంగా నది వెంబడి ఎన్ని డాల్ఫిన్లు (ప్లాటెనిస్టా గంగెటికా) ఉన్నట్లు నివేదిక తెలుపుతుంది.?
జ : 4 వేలకు పైగా
4) ఎడ్యు ఫండ్ నివేదిక ప్రకారం భారత్ లో ఒక బిడ్డను కని పెంచడానికి అయ్యే ఖర్చు ఎంత.?
జ : 75 లక్షలు
5) కాగ్ నివేదిక ప్రకారం 2023 – 24 లో తెలంగాణ రాష్ట్ర ద్రవ్యలోటు ఎంత.?
జ : 49,440.92 కోట్లు
6) దేశంలో 76% రొయ్యల ఉత్పత్తి ఏ రాష్ట్రం నుండి వస్తుంది.?
జ : ఆంధ్రప్రదేశ్
7) ఆక్వా రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
జ : ఆంధ్రప్రదేశ్
8) తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ మెగా ఫుడ్ పార్కును ఖమ్మం జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేశారు.?
జ : బుగ్గపాడు
9) మాటలు రాని పిల్లల కోసం అమ్మ యాప్ ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది.?
జ : నిట్ వరంగల్
10) ఎమిలియా గ్రాండ్ ప్రి విజేతగా వెర్ స్టాఫెన్ నిలిచాడు. ఇది తన కెరీర్ లో ఎన్నో విజయం.?
జ : 59వ విజయం
11) వెస్టిండీస్ – అమెరికాలో జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2024 అంబాసిడర్ గా ఏ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ను ఐసీసీ నియమించింది.?
జ : షాహిద్ ఆప్రిది (యువరాజ్ సింగ్, క్రిస్ గేల్, ఉసెన్ బోల్ట్)
12) ICRA అంచనాల ప్రకారం 2024 – 25 లో దేశ జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 7.8%
13) హైదరాబాద్ లో ఎయిర్ టాక్సీ లను నడపడానికి ఏ సంస్థ ముందుకు వచ్చింది.?
జ : DROGR DRONES
14) త్వరలోనే తల మార్పిడి శస్త్ర చికిత్స చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో కృషి చేస్తున్నట్లు ఏ సంస్థ ప్రకటించింది.?
జ : బ్రెయిన్ బ్రిడ్జ్
15) అతిపెద్ద వయసులో (90) అంతరిక్షయానం చేసిన వ్యక్తిగా ఎవరు ఇటీవల రికార్డు సృష్టించారు.?
జ : ఎడ్ డ్వైట్