TODAY CURRENT AFFAIRS IN TELUGU 24th JANUARY 2024
1) ఎటీపీ వరల్డ్ టెన్నిస్ ర్యాంకింగులలో పురుషుల డబుల్స్ లో మొదటి ర్యాంక్ సాధించిన జోడి ఏది.?
జ : రోహన్ బోపన్న – మాథ్యూ ఎబ్డెన్
2) ఎటీపీ వరల్డ్ టెన్నిస్ ర్యాంకింగులలో అతిపెద్ద వయస్సులో (43 ఏళ్ళు) మొదటి ర్యాంక్ సాదించిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రోహన్ బోపన్న
3) ఏ దేశంలో వీదేశి రాయబారుల కోసం ఇటీవల తొలి మద్యం దుఖనాన్ని ప్రారంభించారు.?
జ : సౌదీ అరేబియా
4) BCCI – పాలీ ఉమ్రిగర్ అవార్డు – 2023 మరియు బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ఇయర్ – 2023 కు ఎవరిని ఎంపిక చేసింది.?
జ : శుభమన్ గిల్
5) KHANJAR పేరుతో ఏ రెండు దేశాల ప్రత్యేక సైనిక దళాలు విన్యాసాలు చేపట్టాయి.?
జ : భారత్ – కిరిగిస్తాన్
6) గ్లోబల్ కాంఫిటీటీవ్‌నెస్ ఇండెక్స్ – 2023 ప్రకారం 134 దేశాలకు గాను భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 103
7) ఏ రాష్ట్రం రూపొందించిన రహదారి ప్రాజెక్ట్ 100% ప్రమాదాలను నివారించింది.?
జ : కేరళ
8) ఏ సంవత్సరం నాటికి రహదారి ప్రమాదాలను వాటి వల్ల సంభవించే మరణాలను సగానికి తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.?
జ : 2030
9) ‘ఎడారి యోధులు’ పేరుతో భారత్ ఏ దేశాలతో కలిసి అరేబియా సముద్రంలో సైనిక విన్యాసాలు చేపట్టింది.?
జ : ఫ్రాన్స్, యూఏఈ
10) ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మద్య శాంతి ఎక్కడ కోసం కట్టబడిన 100 అడుగుల శాంతి కమాన్ ను ఇటీవల కూల్చివేశారు.?
జ : ప్యాంగ్ యాంగ్
11) ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య సోమశిల ప్రాజెక్టు వద్ద కృష్ణా నదిపై నిర్మించతలపెట్టిన ఐకానిక్ బ్రిడ్జ్ ను కేంద్ర ప్రభుత్వం ఏ పథకంలో చేర్చింది.?
జ : భారత్ మాల – 2
12) తాజాగా ఏ కంపెనీ విలువ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరింది.? మూడు ట్రిలియన్స్ దాటిన తొలి కంపెనీ యాపిల్.
జ : మైక్రోసాఫ్ట్
13) టైమ్ ఔట్ సంస్థ విడుదల చేసిన ప్రపంచ ఉత్తమ 50 నగరాల జాబితాలో భారత్ నుండి ఏ నగరం స్థానం పొందింది.?
జ : ముంబై (12వ స్థానం)
14) బాక్సింగ్ క్రీడకు వీడ్కోలు పలికిన భారత స్టార్ మహిళ బాక్సర్ ఎవరు.?
జ : మేరీ కోమ్
15) ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు 2023 గా ఎవరు నిలిచారు.?
జ : రచిన్ రవీంద్ర
16) ఐసీసీ టీట్వంటీ ప్లేయర్ అవార్డు 2023 గా ఎవరు నిలిచారు.?
జ : సూర్య కుమార్ యాదవ్
17) అయోధ్య లో ఇండో ఇస్లామిక్ కల్చర్ ఫౌండేషన్ ఏ పేరుతో మజీద్ నిర్మించనుంది.?
జ :మజీద్ మహ్మద్ బీన్ అబ్దుల్లా
18) గ్లోబల్ స్టాక్ మార్కెట్ ర్యాంకింగులలో భారత్ హంకాంగ్ ను దాటి ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 4వ