TODAY CURRENT AFFAIRS IN TELUGU 23rd JULY 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 23rd JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 23rd JULY 2024

1) ఎన్ని లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ 2024 – 24 ను కేంద్రం ప్రవేశ పెట్టింది.?
జ : 48,20,512 కోట్లతో

2) బడ్జెట్‌లో పిల్లల భవిష్యత్‌కు భరోసానిచ్చే కొత్త ఎన్‌పీఎస్‌ పథకాన్ని కేంద్రం ప్రకటించింది. దాని పేరు ఏమిటి.?
జ : NPS VATSLAYA

3) అటవీ భూముల అభివృద్ధిలో ప్రపంచంలోనే భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : మూడో స్థానంలో

4) అటవీ భూముల అభివృద్ధిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : చైనా.

5) 2023లో ఎంతమంది హెచ్ఐవీ తో ఉన్నట్లు ఐరాస రిపోర్టు తెలిపింది.?
జ : 4 కోట్ల మంది

6) ఏ సంవత్సరం నాటికి సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని రష్యా నిర్ణయం తీసుకుంది.?
జ : 2033

7) పారిస్ ఒలింపిక్స్ త‌ర్వాత టెన్నిస్‌కు గుడ్ బై చెప్తాన‌ని ప్రకటించిన ఆటగాడు ఎవరు.?
జ : అండీ ముర్రే

8) ముద్ర రుణాల పరిమితిని కేంద్ర బడ్జెట్లో ఎంతవరకు పెంచడం జరిగింది.~
జ : 20 లక్షల వరకు

9) కేంద్ర బడ్జెట్ 2024 – 25 ప్రకారం ద్రవ్య లోటు, ప్రాథమిక లోటు, రెవెన్యూ లోటు లక్ష్యాలు వరుసగా ఎంత శాతంగా నిర్ణయించారు.?
జ : 4.9%, 1.4%, 1.8%

10) 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి రైల్వే బడ్జెట్ పరిమాణం ఎంత.?
జ : 2.62 లక్షల కోట్లు

11) 2024 – 25 కేంద్ర బడ్జెట్ లో రక్షణ శాఖకు ఎన్ని లక్షల కోట్లు కేటాయించారు.?
జ : 4,54,773 కోట్లు

12) 2024 – 25 కేంద్ర బడ్జెట్ లో అప్పులకు వడ్డీలు కట్టడానికి ఎన్ని లక్షల కోట్లు కేటాయించారు.?
జ : 11,62,940 కోట్లు

13) కేంద్ర బడ్జెట్ 2024 – 25 లో 5 తూర్పు రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి.?
జ : పూర్వోదయ పథకం

14) సముద్రం అట్టడుగు ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ను ఏమని పిలుస్తారు.?
జ : డార్క్ ఆక్సిజన్

15) కేంద్ర బడ్జెట్ 2024 – 25లో గిరిజనుల ఆర్థిక అభివృద్ధి, అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన పథకం ఏమిటి.?
జ : జన్ జాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు