TODAY CURRENT AFFAIRS IN TELUGU 23rd APRIL 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 23rd APRIL 2024

1) డేటా ట్రాఫిక్ లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిన సంస్థ ఏది.?
జ : జియో

2) సెరా – బ్లూ ఆరిజిన్ సంస్థలు ఏ వ్యోమోనౌక ద్వారా సాధారణ పౌరులకు అంతరిక్ష యాత్ర చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు.?
జ : న్యూ షెపర్డ్

3) S-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలను భారత్ ఏ దేశం నుండి దిగుమతి చేసుకోనుంది.?
జ : రష్యా

4) ఉక్రేయిన్ కు ఏ దేశం 542 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది .?
జ : బ్రిటన్

5) కేంద్ర నివేదిక ప్రకారం శుద్ధ ఇంధన రంగంలో ఏ రాష్ట్రాలు ముందున్నాయి.?
జ : కర్ణాటక, గుజరాత్

6) సిప్రి నివేదిక 2023 ప్రకారం రక్షణ వ్యయంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది .?
జ : నాలుగవ స్థానం

7) లెవల్ – 6 ముప్పు నుండి కూడా రక్షణ కల్పించే బుల్లెట్ ప్రూప్ జాకెట్ ను ఏ సంస్థ తయారు చేసింది.?
జ : డి ఆర్ డి ఓ

8) లారియస్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు.?
జ : నోవాక్ జకోవిచ్

9) మహిళల టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ లలో భారత్ తరపున మొదటి స్థానంలో నిలిచిన తెలుగు క్రీడాకారిణి ఎవరు.?
జ : ఆకుల శ్రీజ

10) లారియస్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు.?
జ : ఐతనా బొన్మాటి

11) టైమ్స్ అత్యంత ప్రభావశీలుర జాబితా – 2024 లో ఎంతమంది భారతీయులు చోటు సంపాదించుకున్నారు.?
జ : 9 మంది

12) భారత్ పే ఎవరిని సీఈవో గా నియమించింది.?
జ : నలిన్ నేగీ

13) WEF యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు 2024 గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : అద్వైత్ నాయర్

14) UN CTAD అంచనాల ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో భారత అభివృద్ధి రేటు ఎంత.?
జ : 6.5%