TODAY CURRENT AFFAIRS IN TELUGU 22nd MARCH 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 22nd MARCH 2024

1) భారత ప్రధాని నరేంద్ర మోడీకి భూటాన్ ప్రభుత్వం అందించిన ఆ దేశపు అత్యున్నత పౌర పురస్కారం పేరు ఏమిటి .?
జ : ఆర్డర్ ఆఫ్ డ్రూక్ గ్యాల్ఫో

2) భారత్ భూటాన్ ల మధ్య ఏ రైల్వే లైన్ ల నిర్మాణానికి భారత్ మరియు భూటాన్ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి.?
జ : కొక్రాఘర్ – గెలెప్ & బనర్హాట్ – సంత్సే

3) మళ్ళీ మళ్లీ ఉపయోగించే ఏ రాకెట్ ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది..?
జ : RLV LEX 02 (పుష్పక్)

4) WTT ఫీడర్ టైటిల్ గెలుచుకున్న తొలి భారత టేబుల్ టెన్నిస్ ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : సత్యన్ జ్ఞానశేఖరన్

5) టీట్వంటీ లలో 12 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : విరాట్ కోహ్లీ

6) పాలపుంత రెండు నక్షత్ర సముదాయాల కలయిక అని ఇటీవల శాస్త్రవేత్తలు పేర్కొని, ఆ రెండు చిన్న గెలాక్సీ లకు ఏమని పేరు పెట్టారు.?
జ : శివ – శక్తి

7) ఊపిరితిత్తుల క్యాన్సర్ కు ఆక్స్ ఫర్డ్ మరియు ఫ్రాన్సిఫ్ క్రిక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టారు దాని పేరు ఏమిటి.?
జ : లంగ్‌వ్యాక్స్

8) ఆవుపాలతో ఇన్సులిన్ హార్మోన్ ను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : అమెరికా

9) భారత పరిశ్రమల సమైక్య (సిఐఐ) దక్షిణ ప్రాంత చైర్మన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : ఆర్ నందిని

10) ప్రపంచ సంతోషకర దేశాల జాబితా 2024 లో మొదటి మరియు చివరి స్థానాల్లో ఉన్న దేశాలు.?
జ : ఫిన్ లాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్

12) కేంద్ర గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో ఎన్ని మంచు చిరుతలు ఉన్నాయి.?
జ : 718

13) ప్రజారోగ్యంపై పరిశోధనలు చేస్తున్న సంస్థల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన భారత్ సంస్థ ఏది.?
జ : పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PHFI)

14) టి 20 క్రికెట్ లో అంతర్జాతీయంగా 12 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఎన్నో ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.?
జ : 6