Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 22nd JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 22nd JULY 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 22nd JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 22nd JULY 2024

1) పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు నెలకు 25 వేల పెన్షన్ ఇవ్వడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.?
జ : తెలంగాణ

2) ప్రభుత్వ ఉద్యోగులు ఏ సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చంటూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది.?
జ : ఆర్ఎస్ఎస్

3) 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి రేటును ఆర్థిక సర్వేలో అంచనా వేశారు.?
జ : 6.5 శాతం మంది 7 శాతం వరకు

4) 2022 – 23 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు ఎంతగా ఆర్థిక సర్వే లో పేర్కొన్నారు.?
జ : 3.2 శాతం

5) ఆర్థిక సర్వే ప్రకారం దేశంలో 54% అనారోగ్య కారణాలకు కారణం ఏమిటి.?
జ : ఒబేసిటీ

6) “ఒలంపిక్ ఆర్డర్ అవార్డు” ను ఏ భారత క్రీడాకారుణికి అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం ప్రకటించింది.?
జ : అభినవ్ బింద్రా

7) అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లలో ఆడిన మొదటి మ్యాచ్ లోనే 7 వికెట్ల తీసిన బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించాడు.?
జ : స్కాట్లాండ్ బౌలర్ చార్లీ కాసెల్

8) మహిళల ఆసియా కప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి క్రీడాకారిణిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : చమేరీ ఆటపట్టు (శ్రీలంక)

9) పారిస్ ఒలంపిక్స్ 2024 కు మస్కట్ గా దేనిని ఎంపిక చేశారు.?
జ : ఫ్రీజ్ బొమ్మ

10) ఏ సౌండింగ్ రాకెట్ ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.?
జ : రోహిణి – 560

11) పారిస్ ఒలంపిక్స్ 2024 లో అమెరికా క్రీడాకారుల బృందంకు పతాకధారిగా ఎవరు ఉండనున్నారు.?
జ : లెబ్రాన్ జేమ్స్

12) ఆహార ద్రవ్యోల్బణం తగ్గించడానికి ఆర్థిక సర్వే ఇచ్చిన సలహా ఏమిటి.?
జ : పేదలకు ఆహార కూపన్లు ఇవ్వడం లేదా నగదు బదిలీ చేపట్టడం

13) 2024 – 2030 మధ్య గ్రీన్ ఎనర్జీ లో ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రావచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది.?
జ : 30.5 లక్షల కోట్లు

14) ఆపిల్ సంస్థ ఎంత శాతం ఫోన్లను భారత్ లోనే తయారు చేస్తుందని ఆర్థిక సర్వే ప్రకటించింది.?
జ : 14%

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు