TODAY CURRENT AFFAIRS IN TELUGU 21st JUNE 2024
1) ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్ మన్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : నీకోలస్ పూరన్ (17)
2) దోమల సంతానోత్పత్తిని నివారించే ఏ బ్యాక్టీరియా కలిగిన మగ దోమలను హెలికాప్టర్ ద్వారా విడుదల చేస్తున్నారు.?
జ : ఓల్బాదియా బ్యాక్టీరియా
3) హిజాబ్ పై తాజాగా ఏ దేశంలో నిషేధం విధించారు.?
జ : తజకిస్తాన్
4) అవాంచిత (రేప్ మరియు అక్రమ సంబదాలు) గర్భాలను అబార్షన్ ద్వారా తొలగించుకునేందుకు ఏ ముస్లిం దేశం తాజాగా అనుమతి ఇచ్చింది.?
జ : యూఏఈ
5) ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2024లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఆస్ట్రేలియా బౌలర్ ఎవరు .?
జ : పాట్ కమిన్స్
6) 2019 – 2024 మధ్య తెలంగాణ రాష్ట్రం లో ఎంతమంది పిడుగుపాటు కారణంగా మరణించారు.?
జ : 384 మంది
7) జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ కమిటీ కన్వీనర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సామ్రాట్ చౌద్రి (బీహార్ ఉపముఖ్యమంత్రి)
8) విద్య పరీక్ష పేపర్ల లీక్ ను అరికట్టేందుకు కేంద్రం తీసుకువచ్చిన చట్టం పేరు ఏమిటి.?
జ : పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆప్ అన్ పెయిర్) యాక్ట్ 2024
9) ప్రపంచంలో అతిపెద్ద కోడింగ్ కాంపిటీషన్ లో మొదటి స్థానంలో నిలిచిన భారతీయురాలు ఎవరు.?
జ : కలాస్ గుప్తా
10) కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన సంస్థ ఏది.?
జ : జూరిచ్ ఇన్సూరెన్స్
11) సికెల్ సెల్ డే గా ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 19
12) సికిల్ సెల్ దినోత్సవం 2024 థీమ్ ఏమిటి.?
జ : Hope Through Progress
13) టి 20 క్రికెట్ లో 27 బంతుల్లోనే సెంచరీ కొట్టిన సోహైల్ చౌహన్ ఏ దేశానికి చెందిన క్రికెటర్.?
జ : ఈస్టోనియా
14) చైనా ఇటీవల ప్రారంభించిన CHASE మిషన్ పూర్తి పేరు ఏమిటి .?
జ : Chinese H Alpha Solar Explorer
15) విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల ఇన్సూరెన్స్ ను ప్రకటించింది.?
జ : కర్ణాటక
16) మెర్సర్ నివేదిక ప్రకారం భారత్ లో అత్యధిక జీవన వ్యయం గల సిటీ ఏది.?
జ : ముంబై
17) ట్రెంట్ బౌల్ట్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఇతను ఏ దేశ బౌలర్.?
జ : న్యూజిలాండ్