TODAY CURRENT AFFAIRS IN TELUGU 21st FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 21st FEBRUARY 2024

1) రేషన్ కార్డుదారులకు రాగిపిండి సరఫరా చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్

2) భారత్ AI జిపిటి పేరు ఏమిటి.?
జ : హనుమాన్

3) ప్రాణకోటి భూమి మీద నివసించడానికి ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత సరిపోతుందని నిపుణులు అంచనా వేశారు.?
జ : 20 డిగ్రీల సెంటిగ్రేడ్

4) కృత్రిమ వృక్షణాలను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : ఇజ్రాయెల్ – బార్ ఈ లాన్ యూనివర్సిటీ

5) 12వ MILAN నావికదళ విన్యాసాలు 2024 ఎక్కడ నిర్వహిస్తున్నారు.?
జ : విశాఖపట్నం

6) 12వ MILAN నావికదళ విన్యాసాలు 2024 థీమ్ ఏమిటి.?
జ : ‘Forging Naval Alliance For a Secure Maritime Future’

7) ఫోన్ పే నుండి కొత్తగా వచ్చిన యాప్ ప్లే స్టోర్ పేరు ఏమిటి.?
జ : ఇండస్ యాప్ స్టోర్

8) భారత బాస్కెట్ బాల్ జట్టు కోచ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సంతోష్

9) యూఏఈ దేశపు క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా నియమితుడైన భారతీయుడు ఎవరు.?
జ : లాల్‌చంద్ రాజ్‌పుత్

10) పాకిస్తాన్ దేశపు నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : షహబాజ్ షరీఫ్

11) పాకిస్తాన్ దేశపు నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : అసిఫ్ ఆలీ జర్దరీ

12) ఇటీవల మరణించిన సీనియర్ న్యాయవాది ఎవరు.?
జ : పాలి శ్యామ్ నారీమన్

13) పాలీ శ్యామ్ నారీమన్ ఎమర్జెన్సీ కాలంలో ఏ ప్రభుత్వ పదవికి రాజీనామా చేశారు.?
జ : అదనపు సొలిసిటర్ జనరల్

14) భారతీయ రేడియో ప్రఖ్యాత ఎనౌన్సర్ ఇటీవల మరణించారు. ఆయన పేరు ఏమిటి.?
జ : అమీన్ సయానీ

15) ఇస్రో గగన్‌యాన్ ప్రయోగంలో ఉపయోగించే ఏ ఇంజీన్ ను విజయవంతంగా పరీక్షించింది.?
జ : CE20 క్రయోజనిక్ ఇంజీన్

16) పంజాబ్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలలో ‘స్టేట్ ఐకాన్’ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : శుభమన్ గిల్