TODAY CURRENT AFFAIRS IN TELUGU 20th JANUARY 2024
1) అయోధ్య రామాలయం ప్రారంభం సందర్భంగా 6 స్మారక పోస్టల్ స్టాంపులను నరేంద్ర మోడీ విడుదల చేశారు. అవి ఏవి.?
జ : రామాలయం, గణేష్, హనుమాన్, జటాయువు, శబరి, కేవటరాజు
2) సశస్త్ర సీమా బల్ నూతన డీజీగా ఎవరు నియమితులయ్యారు.?
జ : దల్జీత్ సింగ్ చౌదరి
3) ప్రపంచంలోనే ఎత్తైన డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహం విజయవాడలో లో ఏపీ సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ విగ్రహనికి ఏమని పేరు పెట్టారు.?
జ : స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టీస్
4) జాతీయ నేర గణంకాల నివేదిక 2023 ప్రకారం దేశంలో సురక్షిత నగరం ఏది.?
జ : కోల్‌కతా
5) జనవరి 27 న ప్రారంభం కానున్న ప్రపంచ చరిత్రలో లోనే అతిపెద్ద ఓడ ఏది.?
జ : ఐకాన్ ఆఫ్ ద సీస్
6) 2028 వరకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా ఏ సంస్థ ఉండనుంది.?
జ : టాటా
7) బ్రిక్స్ జీవన సాఫల్య పురస్కారం అందుకున్న మిల్లెట్ మాన్ ఆఫ్ ఇండియా ఎవరు.?
జ : ఖాదర్ వలీ
8) ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగితే మనిషి ఆయుర్దాయం ఎన్ని నెలలు తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది.?
జ : ఆరు నెలలు
9) చంద్రయాన్ 3 ద్వారా పంపిన ల్యాండర్ చంద్రుని పై ఏవిధంగా పనిచేస్తుందని ఇస్రో ఇటీవల ప్రకటించింది.?
జ : ల్యాండ్ మార్కర్
10) దేశంలో తొలి ఎపటైటిస్ – ఏ టీకాను (హవిష్యూర్) అభివృద్ధి చేసిన సంస్థ ఏది.?
జ : ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (హైదరాబాద్)
11) బీహార్ తర్వాత కుల గణన అధికారికంగా చేపట్టిన రెండో రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది.?
జ : ఆంధ్ర ప్రదేశ్
12) ప్రపంచంలో అతిపెద్ద (300 అడుగుల) ‘జ్యోతి’ ని ఎక్కడ ప్రారంభించారు .?
జ : అయోధ్య
13) G-77 మూడో దక్షిణ దేశాల సదస్సు 2024 ఎక్కడ జరగనుంది.?
జ : కంపాలా – ఉగాండ
14) మహిళల అభివృద్ధి, భద్రత కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ఏ కార్యక్రమం వరల్డ్ ఎకనామిక్ సదస్సు 2024 లో చర్చకు వచ్చింది.?
జ : Global Good Alliance for Gender Equity and Equality
15) ప్రపంచంలో రెండో అతిపెద్ద బోయింగ్ క్యాంపస్ ను భారతదేశంలో ఎక్కడ ప్రారంభించారు.?
జ : బెంగళూరు
16) జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం ఏ భాషను జాతీయ క్లాసికల్ బాషాగా ఇటీవల గుర్తించారు.?
జ : పార్శీ (తమిళ్, తెలుగు, కన్నడ, ఒడియా, సంస్కృతం, మళయాళం, )
17) కర్ణాటక రాష్ట్రం దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు లో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది.?
జ : 22 వేల కోట్లు
18) తెలంగాణ రాష్ట్రం దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు లో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది.?
జ : 37 వేల కోట్లు
19) IMF సంస్థ ఏ దేశానికి 700 మిలియన్ డాలర్లను బెయిల్ అవుట్ గా ప్రకటించింది.?
జ : పాకిస్థాన్
20) మహారాష్ట్ర దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు లో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది.?
జ : 4 లక్షల కోట్లు