Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 1st SEPTEMBER 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 1st SEPTEMBER 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 1st SEPTEMBER 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 1st SEPTEMBER 2024

1) ఆసియన్‌ నోబెల్‌ ప్రైజ్‌గా భావించే రామన్‌ మెగసెసె అవార్డు 2024 సంవత్సరానికిగానూ ఎవరికి ప్రకటించారు.?
జ : ప్రముఖ జపాన్‌ యానిమేటర్‌ హయావో మియాజాకీ, వియత్నాం డాక్టర్‌ న్గుయెన్‌, మాజీ బౌద్ధ సన్యాసి కర్మ ఫుంట్‌షొ, ఇండోనేషియాకు చెందిన ఫర్విజీ ఫర్హాన్‌కు

2) రామన్‌ మెగసెసె అవార్డు 2024 సంవత్సరానికిగానూ ఏ సంస్థకు ప్రకటించారు.?
జ : థాయ్‌లాండ్‌కు చెందిన రూరల్‌ డాక్టర్స్‌ మూమెంట్‌ సంస్థకు

3) వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు ఆగస్టు నెలలో ఎంతగా వసూళ్లు అయింది.?
జ : రూ.1.75 లక్షల కోట్లు

4) ప్రపంచంలోనే మొట్ట మొదటి సారి ఇథనాల్‌తో నడిచే బైక్ ను ఏ సంస్థ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.?
జ : బజాజ్

5) టీ20ల్లో ఒకే ఏడాది అత్య‌ధిక సిక్స‌ర్ల కొట్టిన క్రికెటర్ గా ఎవరు నిలిచారు.?
జ : నికోలస్ పూరన్ (139 సిక్స‌ర్లతో)

6) ఏ వెస్టిండీస్ క్రికెటర్ ఇప్ప‌టికే వ‌న్డేల‌కు, టెస్టుల‌తో పాటు ఐపీఎల్ నుంచి వైదొలిగిన, ఫ్రాంచైజీ క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.?
జ : డ్వేన్ బ్రావో

7) మూడీస్ సంస్థ తాజా అంచనాల ప్రకారం 2024 – 25లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 7.2%

8) ఆసియాలో అత్యంత మంది బిలినియర్స్ ఉన్న నగరంగా బీజింగ్ (91 మంది) ను ఏ నగరం అధిగమించింది.?
జ : ముంబై (92 మంది)

9) అమెజాన్ సంస్థ తీసుకువచ్చిన ఏఐ చాట్ బాట్ పేరు ఏమిటి.?
జ : RUFUS

10) మదురైలోని ఏ చెరువును బర్డ్స్ శాంక్చుయరీ గా అభివృద్ధి చేశారు.?
జ : సమానాథం చెరువు

11) గోల్డ్ మాన్ శాక్స్ అంచనాల ప్రకారం 2024 & 2025 లలో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.స
జ : 2024 – 6.7% & 2025 – 6.4%

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు