Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 1st FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 1st FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 1st FEBRUARY 2024

1) ఏ దేశం నాలుగు అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.?
జ : ఇరాన్

2) జార్ఖండ్ రాష్ట్ర నూతన సీఎం గా గవర్నర్ సిపీ రాధకృష్ణన్ ఎవరిని నియమించారు.?
జ : చంపయీ సోరెన్

3) లఖ్‌పతీ దీదీ పథకం ద్వారా ఎంతమంది స్వయం సహయక సంఘాల మహిళలకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని బడ్జెట్ లో పేర్కొన్నారు.?
జ : 3 కోట్ల మంది

4) తెలంగాణ జీవన్ దాన్ కు (అవయవాల ట్రాన్స్‌ప్లాంటేషన్ ) దక్కిన అంతర్జాతీయ అవార్డు ఏది.?
జ : హయత్ ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ ఫ్రేమ్‌వర్క్ అవార్డు

5) బియ్యాన్ని 29 రూపాయాలకే ఏ రూపంలో అందించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.?
జ : భారత్ బ్రాండ్

6) ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024 లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : మహారాష్ట్ర

7) ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024 లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సాదించిన పతకాలు ఎన్ని.?
జ : TS – 26, AP – 24

8) ఎలన్ మస్క్ సంస్థ టెస్లా తయారు చేస్తున్న హ్యుమనాయిడ్ రోబో ఏది.?
జ : అప్టిమస్

9) జనవరి – 2024 లో వసూలు అయినా జీఎస్టీ ఎంత.?
జ : 1,72,129 కోట్లు

10) 2023 హురూన్ గ్లోబల్ – 500 జాబితా ప్రకారం భారత్ లో విలువైన కంపెనీ ఏది.?
జ : రిలయన్స్ (ప్రపంచంలో 44వ స్థానం)

11) రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శకటాలలో మొదటి స్థానంలో ఏ రాష్ట్ర శకటం నిలిచింది.?
జ : ఒడిశా

12) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులకు ఎవరి పేరు పెట్టింది.?
జ : గద్దర్ సినీ అవార్డులు

13) తెలుగు భాషారత్న పురష్కారంకు ఎవరిని ఎంపిక చేశారు.?
జ : సుద్దాల అశోక్ తేజ

14) యూఏఈ లోని అబుదాబిలో ఏ సంస్థ నిర్మిస్తున్న హిందూ దేవాలయంను నరేంద్ర మోడీ ఫిబ్రవరి 14న ప్రారంభించనున్నారు.?
జ : స్వామి నారయణ్ సంస్థ

15) ఐరాస నివేదిక ప్రకారం 2022 నాటికి ప్రపంచంలో అత్యధికంగా కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశం ఏది.?
జ : చైనా

16) జాతీయ ఓపెన్ రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్ లో జాతీయ రికార్డు (20 కీ.మీ. – 1.19.38 గంటలలో) ఎవరు నెలకొల్పారు.?
జ : అక్ష్‌దీప్ సింగ్

17) 200 కోట్లతో 190 అడుగుల మోడీ కాంస్య విగ్రహాన్ని వ్యాపరవేత్త నవీన్ చంద్ర బోరా ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు.?
జ : అసోం