BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 1st AUGUST 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 1st AUGUST 2024
1) 2023 లో భారత పౌరసత్వం వదులుకున్న భారతీయులు ఎందరు.?
జ : 2,16,219
2) హమస్ మిలటరీ చీఫ్ తాజాగా హత్యకు గురయ్యాడు. అతని పేరు ఏమిటి.?
జ : మహ్మద్ డేయిఫ్
3) మేఘాలయలో ఇటీవల గుర్తించిన కొత్త చేప జాతి రకం ఏది.?
జ : షిస్తురా సోనారెంగెన్సిస్
4) ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ప్రకారం వర్గీకరణ అధికారం ఎవరికి ఉంది.?
జ : రాష్ట్రాలకు
5) విదేశాల్లో ఎంతమంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.?
జ : 13 లక్షల మందికి పైగా
6) 2024 జూలై నెలకు గాను వసూళ్లైన దేశపు జీఎస్టీ ఎంత.?
జ: 1.82 లక్షల కోట్లు
7) 2024 జూలై నెలకు గాను తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు ఎంత.?
జ :రూ.4,940 కోట్లు
8) 2024 జూలైలో యూపీఐ పేమెంట్స్ ఎన్ని లక్షల కోట్లు గా నమోదు అయింది.?
జ : 20 లక్షల కోట్లు
9) పారిస్ ఒలింపిక్స్ లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో కాంస్యం నెగ్గిన భారత షూటర్ ఎవరు.?
జ : స్వప్నిల్ కుశాల్
10) దేశంలో తొలిసారిగా ఎక్కడ సబ్‌మెర్జ్‌డ్ మ్యూజియం ఏర్పాటు చేశారు.?
జ : న్యూడిల్లి
11) టైమ్స్ మ్యాగజైన్ ‘ గ్రేటెస్ట్ ప్లేసెస్ 2024’ లో చోటు దక్కించుకున్న భారతీయ ప్రాంతాలు ఎన్ని.?
జ : 3
12) వెంకయ్య ఎఫిగ్రఫి ప్రైజ్ 2024 ఎవరికి అందజేశారు.?
జ : వి. వేదాచలం
13) 2025 మార్చి వరకు ఎన్ని జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.?
జ : 2500
14) అంతర్జాతీయ పులుల దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : జూలై 29