Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 19th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 19th FEBRUARY 2024

1) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఏ గ్రహం మీదకు డ్రోన్ ను పంపాలని నిర్ణయం తీసుకుంది.?
జ : అంగారకుడు

2) మహిళల టీం ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : భారత మహిళల జట్టు

3) చైనా అంతరిక్షంలోకి పంపిన ఐన్ స్టీన్ ప్రోబ్ అనే శాటిలైట్ ముఖ్య లక్ష్యం ఏమిటి.?
జ : అంతరిక్ష పేలుళ్లను గుర్తించడం

4) ఏ దేశంలోని హౌతి తిరుగుబాటుదారుల స్థావరాలపై అమెరికా, బ్రిటన్ లు సంయుక్తంగా దాడులు జరిపాయి.?
జ : యోమెన్

5) కల్నల్ సి కె నాయుడు ట్రోఫిలో లో భాగంగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన ఆంధ్ర క్రికెటర్ ఎవరు?
జ : వంశీకృష్ణ

6) భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతి భారీ విజయాన్ని ఇంగ్లాండు మీద నమోదు చేసింది.ఎన్ని పరుగుల తేడాతో గెలిచింది.?
జ : 434 పరుగుల తేడాతో

7) టెస్ట్ క్రికెట్ లో ఒకే ఇన్నింగ్స్ లో 12 సిక్సర్ లు కొట్టిన ఎవరి రికార్డును యశస్వి జైస్వాల్ సమం చేశాడు.?
జ : వసీం అక్రమ్

8) మూడు వరుస టెస్టుల్లో రెండు డబల్ సెంచరీలు కొట్టిన ఎవరీ రికార్డును యశస్వి జైస్వాల్ ఎవరి రికార్డు ను సమం చేశాడు.?
జ : వినోద్ కాంబ్లీ, విరాట్ కోహ్లీ

9) బెంగళూరు ఓపెన్ టెన్నిస్ ట్రోఫీ 2024 పురుషుల డబుల్స్ టైటిల్ సాధించిన భారత జోడి ఏది.?
జ : సాకేత్ మైనేని – రామ్‌కుమార్ రామనాధన్

10) తాజా FIFA RANKING లో తాజాగా భారత్ ఫుట్బాల్ జట్టు ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 117

11) తాజా FIFA RANKING లో మొదటి స్థానంలో నిలిచిన జట్టు ఏది.?
జ : అర్జెంటీనా

12) లాన్సెట్ కమిషన్ ఫర్ గ్లోబల్ సర్జరీ నివేదిక ప్రకారం ఎంతమందికి భద్రమైన శాస్త్ర చికిత్సలు అందుబాటులో లేవు.?
జ : 500 కోట్లు మందికి

13) ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ ను అధిగమించి ఏ కంపెనీ నిలిచింది.?
జ : మైక్రోసాఫ్ట్

14) గాలిలో ఎగిరే విద్యుత్ కాప్టర్లను ఏ సంస్థ తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది.?
జ : మారుతి