TODAY CURRENT AFFAIRS IN TELUGU 18th FEBRUARY 2024
1) భారత నౌకా దళంలోకి అధునాతన యుద్ధ నిఘా విమానాలను భారత రక్షణ శాఖ ఏ సంస్థ నుండి కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది.?
జ : ఎయిర్ బస్
2) పీచు మిఠాయి అమ్మకాలపై ఏ రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించాయి.?
జ : తమిళనాడు, పుదుచ్చేరి
3) పీచు మిఠాయిలో ఏ క్యాన్సర్ కారక రసాయనం ఉన్నట్లు ప్రభుత్వాలు గుర్తించాయి.?
జ : రోడమైన్ – బీ
4) జ్ఞాన్ పీఠ్ అవార్డు 2023 కు ఎవరిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.?
జ : గుల్జార్, రామభధ్రచార్య
5) 30 అండర్ 30 పేరుతో ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన జాబితాలో చోటు దక్కించుకున్న తెలుగు వారు ఎవరు.?
జ : శశాంక్ గుజ్జుల, అనుపమ్, రామకృష్ణ
6) మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో అత్యంత ప్రజాదరణ పొందిన భారత ప్రధానిగా ఎవరు నిలిచారు.?
జ : నరేంద్ర మోడీ
7) మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి గా ఎవరు నిలిచారు.?
జ : నవీన్ పట్నాయక్
8) అంతర్జాతీయ టెస్ట్ మ్యాచులలో తొలి 3 శతకాలను 150 ప్లస్ స్కోర్ లుగా మలిచిన తొలి భారత బ్యాట్స్మెన్ గా ఎవరు నిలిచారు.?
జ : యశస్వీ జైశ్వాల్
9) చెక్కతో తయారుచేసిన ఉపగ్రహాన్ని ఏ అంతరిక్ష పరిశోధన సంస్థలు త్వరలో ప్రయోగించనున్నాయి.?
జ : నాసా మరియు జాక్సా
10) దాదాపు 17 సంవత్సరాల క్రితం ప్రయోగించిన ఏ శాటిలైట్ ను ఇస్రో సముద్రంలో పడేలా చేసింది.?
జ : కార్డోశాట్
11) దమ్ పుఖ్త్ (పాత్ర మూత చుట్టూ పిండి ముద్దను చుట్టే విధానం) ను ప్రాచుర్యం లోకి తెచ్చిన ప్రముఖ చెఫ్ ఇటీవల మరణించారు. ఆయన పేరు ఏమిటి.?
జ : ఇంతియాజ్ ఖురేషీ
12) ప్రాన్స్ ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు.?
జ : గాబ్రియోల్ అట్టల్
13) కుక్క మాంసాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటిస్తూ ఏ దేశ పార్లమెంట్ చట్టం చేసింది.?
జ : దక్షిణ కొరియా
14) మహిళల అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీని ఎవరు సాధించారు.?
జ : అనాబెల్ సధర్‌లాండ్(ఆస్ట్రేలియా – 248 బంతుల్లో)
15) బ్రెజిల్ యూనివర్సిటీ అంచనాల ప్రకారం 2050 కల్లా అమెజాన్ అడవులు ఎంత శాతం నరికివేతకు గురికావచ్చు అని అంచనా వేసింది.?
జ : 47 శాతం
16) తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సిరిసిల్ల రాజయ్య
17) ఏ రాష్ట్ర అసెంబ్లీ ఇటీవల కుల గణన తీర్మానానికి ఆమోదం తెలిపింది.?
జ : తెలంగాణ