BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 18th AUGUST 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 18th AUGUST 2024
1) ప్రపంచంలో అతిపెద్ద హైవే గా ఏది గిన్నిస్ రికార్డు లకు ఎక్కింది.?
జ : పాన్ అమెరికన్ హైవే (30,577 కీ.మీ.)
2) తాజాగా మూడు చిత్తడి నేలలను కేంద్రం గుర్తించింది. దీంతో భారత్ లో మొత్తం చిత్తడి నేలల సంఖ్య ఎంత.?
జ : 85
3) తాజాగా ప్రభుత్వం గుర్తించిన చిత్తడి నేలలు ఏవి.?
జ : నంజారయాన్, కజువేలి, తవా
4) ఉదర శక్తి – 2024 పేరుతో భారత వైమానిక దళం ఏ దేశంతో కలిసి విన్యాసాలు చేపట్టింది.?
జ : మలేషియా
5) సూపర్ బ్లూ మూన్ ఏ రోజు కనువిందు చేసింది.?
జ : ఆగస్ట్ – 19 – 2024
6) ఇటీవల మరణించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ ఎవరు.?
జ : రాకేశ్ పాల్
7) రష్యాలో భారీ భూకంపం కారణంగా కంచట్కా ద్వీపకల్పంలో బద్దలైన అగ్నిపర్వతం ఏది.?
జ : షివేలుచ్ అగ్నిపర్వతం
8) టెస్టుల్లో ఒక జట్టు పై వరుసగా అత్యధిక సార్లు (10) సిరీస్ నెగ్గిన జట్టుగా ఏ జట్టు రికార్డు సృష్టించింది.?
జ : దక్షిణాఫ్రికా (వెస్టిండీస్ పై)
9) ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ 2024 ఏ దేశంలో నిర్వహించనున్నారు.?
జ : చైనా
10) 150 ఏళ్ల టెస్టు క్రికెట్ కు చిహ్నంగా 2027 లో ఏ గ్రౌండ్ లో ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ మద్య మ్యాచ్ నిర్వహించనున్నారు.?
జ : మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో
11) మహిళల హండ్రెడ్ టోర్నీ – 2024 విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : లండన్ స్పిరిట్ జట్టు
12) 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా సంఘాల పొదుపులో మొదటి రెండు స్థానాలలో నిలిచిన రాష్ట్రాలు ఏవి.?
జ : ఆంధ్రప్రదేశ్
13) 5 నిమిషాలలో 100% చార్జింగ్ అయ్యో టెక్నాలజీ ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది.?
జ : రియల్ మి (చైనా)