TODAY CURRENT AFFAIRS IN TELUGU 17th MAY 2024
1) ఆగ్రాలో 1904లో ప్రారంభమై తాజాగా పూర్తయిన “స్వామి బాగ్” ఎవరి స్మృత్ద్యార్థం నిర్మించారు.?
జ : శివ దయాల్ సింగ్
2) లాన్సెట్ నివేదిక ప్రకారం 2050 నాటికి పురుషులు మరియు స్త్రీలలో సగటు ఆయుర్దాయం ఎన్ని సంవత్సరాలు పెరగనుంది.?
జ : పురుషులు – 5, స్త్రీలు – 4
3) మెదడు పాడవకుండా ఉపయోగపడే క్రయోజనిక్ ఫ్రీజర్ ను చైనా ఏ పేరుతో అభివృద్ధి చేసింది.?
జ : మేడీ
4) పిరమిడ్ల నిర్మాణం అప్పుడు భారీ శిలల రవాణాకు ఉపయోగపడిన ఏ నైలునది పాయను ఇటీవల గుర్తించారు.?
జ : అర్హమత్ (64 కీ.మీ.)
5) ప్రపంచంలో డోపింగ్ నిరోధక సంస్థ (WADA) ఏ భారత మహిళా బాక్సర్ పై నిషేధం విధించింది.?
జ : పర్వీన్ హుడా
6) సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ నివేదిక ప్రకారం గత దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా ఎంతమంది అనాధ పిల్లలను దత్తతకు ఇచ్చారు.?
జ : 36,857 మంది
7) సింగపూర్ దేశపు నాలుగో ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు.?
జ : లారెన్స్ వాంగ్
8) సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : కపిల్ సిబాల్
9) ఏ నాలుగు దేశాలతో కూడిన యూరోఫియన్ స్వేచ్ఛ వాణిజ్య సంఘం భారత్ తో 100 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది.?
జ : స్విట్జర్లాండ్, నార్వే, లిచెన్ స్టన్, ఐస్‌ల్యాండ్
10) పర్యావరణం కోసం పనిచేస్తున్న వ్యక్తుల కోసం ఏ దేశం ‘బ్లూ రెసిడెన్సి వీసా’లను తీసుకురానుంది .?
జ : యూఏఈ
11) ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రకారం ఆగ్నేయాసియాలో రక్తపోటు బాధితుల సంఖ్య ఎంత?
జ : 29.4 కోట్ల మంది
12) ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్టిస్తున్న క్రీడాకారుల జాబితా 2024లో మొదటి స్థానంలో ఎవరున్నారు?
జ : క్రిస్టియానో రోనాల్డో