TODAY CURRENT AFFAIRS IN TELUGU 17th MARCH 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 17th MARCH 2024

1) మానావాభివృద్ది సూచీ 2024 లో భారత ర్యాంక్ ఎంత.?
జ : 134 (193 దేశాలకు గానూ)

2) పాలస్తీనా నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు.?
జ :మహ్మద్ మస్తాఫా

3) పొర్ట్‌బ్లేయర్ వేదికగా సీ డిఫెండర్ 2024 పేరుతో ఏ దేశాలు నావికదళ విన్యాసాలు చేశాయి.?
జ : ఇండియా – అమెరికా

4) దేశంలో తొలి ఫ్లయింగ్ టాక్సీ ని ఏ పేరుతో ఈ – ప్లేన్ కంపేనీ అభివృద్ధి చేసింది.?
జ : E – 200

5) ఏ రాష్ట్ర ప్రభుత్వం బైక్ టాక్సీ లను నిషేధించింది.?
జ : కర్ణాటక

6) తెలంగాణ రాష్ట్ర పేరు సంక్షిప్త రూపం ను TS కు బదులు ఏ విధంగా మారుస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది.?
జ : TG

7) ఆంద్రప్రదేశ్ కు చెందిన ఏ వస్త్రానికి జీఐ ట్యాగ్ లభించింది.?
జ : నర్సాపూర్ క్రొచెట్‌లెస్ క్రాప్ట్

8) స్వదేశీ దర్శన్ పథకంలో ఏ ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాంత అబివృద్దికి నిధులు కేటాయించారు.?
జ : బొర్రా గుహలు

9) ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో ప్రారంభించనున్న STEM LABS ఉద్దేశ్యం ఏమిటి.?
జ : సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ నైపుణ్యాల పెంపు

10) మాథ్యూ వేడ్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఇతను ఏ దేశ క్రికెటర్.?
జ : ఆస్ట్రేలియా

11) ఏ సంవత్సరం నాటికి భారత్ ఎగువ మద్య ఆదాయ దేశంగా అవతరిస్తుందని క్రిసిల్ అంచనా వేసింది.?
జ : 2031

12) టాటా సంస్థ దేశంలోనే తొలి సెమీ కండక్టర్ చిప్ పరిశ్రమను ఎక్కడ ప్రారంభించనుంది.?
జ : దొలేరా (గుజరాత్)

13) రెండింతల ఎనర్జీ ని స్టోర్ చేసుకునే ఏ రకమైన బ్యాటరీలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : లిథియం సల్ఫర్ బ్యాటరీలు