BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 17th AUGUST 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 17th AUGUST 2024
1) జమ్మూకాశ్మీర్ డీజీపీ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నళిని ప్రభాత్
2) పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : కేసీ వేణుగోపాల్
3) భారత పురుషుల జూనియర్ హకీ టీమ్ కోచ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : పీఆర్ శ్రీజేశ్
4) తొలి మైక్రో విద్యుత్ కారును ఏ పేరుతో భారత్ లో ప్రవేశపెట్టనున్నారు.?
జ : రాబిన్
5) అత్యధికంగా మద్యపానం సేవిస్తున్న రాష్ట్రాలలో మొదటి రెండు స్థానాలలో ఉన్న రాష్ట్రాలు ఏవి.?
జ : అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ
6) ఏ వైరస్ కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజాగా గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.?
జ : మంకీపాక్స్ (ఎంపాక్స్)
7) థాయ్‌లాండ్ నూతన ప్రధానిగా ఎవరిని ఆదేశ పార్లమెంటు శుక్రవారం ఎన్నుకుంది.? రెండో మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించింది.?
జ : పెటోంగ్టార్న్ షినవత్ర (37)ను
8) తాజాగా ఏ దేశంలో 6.3 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది..?
జ : తైవాన్
9) ఏ సంవత్సరం నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా భారత్ అవతరిస్తుందని ఐఎంఎఫ్ తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గీతా గోపీనాధ్ తెలిపారు.?
జ : 2027
10) 2024-25 ఆర్ధిక సంవత్సరానికి భారత్ వృద్ధి రేటును ఐఎంఎఫ్ ఎంతగా అంచనా వేసింది.?
జ : 7 శాతంగా
11) ఆగస్టు మాసాంతం నుంచి మొదలుకాబోయే పారాలింపిక్స్‌లో ప్రారంభ వేడుకలకు భారత్ నుంచి పతాకధారులుగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : సుమిత్ అంతిల్, భాగ్యశ్రీ జాదవ్
12) తాజాగా శ్రీలంక ఏ క్రికెటర్ డోప్ టెస్టులో ఫెయిల్ కావడంతో నిషేధానికి గురయ్యాడు.?
జ : నిరోషన్ డిక్‌వెల్లా
13) శ్రీలంక మహిళా క్రికెటర్ వన్డేల్లో తొలి శతకం కొట్టి, ఈ ఘనత సాధించిన లంక రెండో మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది.?
జ : ఓపెనర్ విశ్మీ గుణరత్నే
14) హైదరాబాద్‌లోఏ పేరుతో స్పోర్ట్స్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.?
జ : యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని
15) మంకీపాక్స్ వైరస్ కారణంగా అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు.?
జ : 537 మంది
16) ఏ స్కాంలో కర్ణాటక గవర్నర్ సీఎం సిద్ధరామయ్య పై విచారణ ప్రారంభించారు.?
జ : ముదా ల్యాండ్స్ స్కామ్
17) బంగ్లాదేశ్ హింసాకాండలో ఎంత మంది మృతి చెందినట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది.?
జ : 650 మంది
18) ఎవరు 18,753 అడుగుల ఎత్తైన కొండ నుంచి పారాచూట్ ద్వారా కిందకు దూకి గిన్నిస్ రికార్డు సృష్టించారు.?
జ : బ్రిటీష్ పర్వతారోహకుడు జాషువా బ్రెగ్‌మెన్
19) ఏ దేశం తమ దేశంలో నివసిస్తున్న విదేశీయులను వారి సొంత దేశాలకు పంపడానికి వారికి 80,000 ఇవ్వడంతో పాటు రవాణా ఖర్చులు భరించడానికి నిర్ణయం తీసుకుంది..?
జ : స్వీడన్
20) యూత్ ఒలింపిక్స్ 2030కు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది.?
జ : భారత్‌లోని ముంబై నగరం
21) ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : ఎంపీ కేశినేని చిన్ని