TODAY CURRENT AFFAIRS IN TELUGU 16th MARCH 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 16th MARCH 2024

1) ప్రపంచంలో మొట్టమొదటి త్రీడి ప్రింటెడ్ మసీదు ఏ దేశంలో ప్రారంభించారు.?
జ : సౌదీ అరేబియా

2) పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలు కోసం ఏ మొబైల్ అప్లికేషన్ కేంద్రం ప్రారంభించింది.?
జ : CAA 2019

3) గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవం కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్కడ ప్రారంభించారు.?
జ : హైదరాబాద్

4) పీవీ నరసింహారావు మెమోరియల్ అవార్డు 2024ను ఎవరికి అందజేశారు .?
జ : రతన్ టాటా

5) చమేలి దేవి జైన్ అవార్డు 2024 ఎవరు గెలుచుకున్నారు.?
జ : గ్రీష్మ కుటార్ & రితిక చోప్రా

6) ఆసిఫ్ అలీ జార్దారి పాకిస్తాన్ ఎన్నో అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు.?
జ : 14వ

7) మహాతరి వందనం యోజన పథకాన్ని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు.?
జ : చత్తీస్‌ఘడ్

8) జాతీయస్థాయిలో క్రీడలలో నైపుణ్యం గుర్తించేందుకు కేంద్ర క్రీడల శాఖ ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి .?
జ : KIRTI

9) ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2024 విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ పై

10) ప్రసార భారతి చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నవనీత్ కుమార్ సెహగల్

11) ఐటీఎఫ్ మహిళల డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్నా జోడి ఏది.?
జ : శ్రీవల్లి & వైదేహి

12) 120 అడుగుల పొడవైన దోసె ను వేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పిన హోటల్ ఏది.?
జ : మావళ్ళి టిఫిన్ రూమ్స్ – బెంగళూరు