Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 15th MARCH 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 15th MARCH 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 15th MARCH 2024

1) పరమవీరచక్ర మరియు రామన్ మెగాసెసే అవార్డులు పొందిన భారత మాజీ నౌక దళపతి ఇటీవల మరణించారు. అతని పేరు ఏమిటి.?
జ : లక్ష్మీ నారాయణ్ రాందాస్

2) వన్డే మరియు టి20 మ్యాచ్ లలో ఓవర్ కి ఓవర్ కి మధ్య ఎంత సమయం తీసుకునేందుకు ఐసీసీ స్టాప్ క్లాక్ నిబంధన ప్రవేశపెట్టింది.?
జ : 60 సెకండ్లు

3) ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచి 2024లో 193 దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 134

4) భారత్ ఇటీవల ఏ కూటమితో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది.?
జ :యూరేషియన్ ఎకానమిక్ యూనియన్

5) తెలంగాణలో ఏ ప్రాంతం జియో హెరిటేజ్ సైటుగా గుర్తింపు పొందింది.?
జ : పాండవుల గుట్ట

6) ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 15

7) మీథేన్ ట్రాకర్ 2024 నివేదిక ప్రకారం ఏ దేశం అత్యధికంగా మీథేన్ గ్యాస్ ను ఉద్గారిస్తుంది.?
జ : అమెరికా

8) కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఎన్ని ఓటీటీ ప్లాట్ ఫారం లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.?
జ : 18

9) రీఛార్జ్ హాడ్లీ మెడల్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా ఏ క్రికెటర్ నిలిచాడు.?
జ : రచిన్ రవీంద్ర

10) అహ్మదాబాద్ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ఏ బ్యాంకుతో 181 మిలియన్ల రుణం కోసం ఒప్పందం చేసుకుంది.?
జ : ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్

11) ప్రామిసింగ్ ఇన్వెస్టర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2023 ఎవరు గెలుచుకున్నారు.?
జ : సచిన్ సాలుంకే

12) పాకిస్తాన్ దేశపు విదేశాంగ శాఖ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఇషాఖ్ దార.

13) ఆరవ జాతీయ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది.?
జ : జంషెడ్‌పూర్

14) తాజా నివేదిక ప్రకారం భారత్ లోఎన్ని బంగారు రంగు కోతులు (గోల్డెన్ లంగూర్) ఉన్నట్లు వెల్లడించింది.?
జ : 7,936