Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 14th MAY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 14th MAY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 14th MAY 2024

1) ఏప్రిల్ 2024 లో ఒక రిటైల్ ఆహర ద్రవ్యోల్బణం ఎంతగా నమోదయింది.?
జ : 8.70%

2) ఇరాన్ దేశంలోని ఏ పోర్టు నిర్వహణ కోసం భారతదేశ ఒప్పందం కుదుర్చుకుంది.?
జ : చాబాహర్ పోర్ట్

3) ఏ దేశం ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది.?
జ : పాకిస్తాన్

4) ప్రపంచ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ లలో టాప్ 25 లో నిలిచిన భారత తొలి మహిళా క్రీడాకారిణిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : మనికా బత్రా (24వ ర్యాంక్)

5) థాయిలాండ్ లో హక్కుల కోసం పోరాడుతున్న ఏ సామాజిక కార్యకర్త జైల్లోనే నిరాహార దీక్ష చేస్తూ మరణించారు.?
జ : నెటిపోర్న్ సనేశంగ్‌ఖోమ్

6) వ్యక్తిగతంగా అత్యధిక సార్లు (29) ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పర్వతారోహకుడిగా ఎవరు అ రికార్డు సృష్టించారు.?
జ : షెర్బా కమీ రీటా

7) భారత్, ప్రాన్స్ దేశాల మధ్య ఏడో సైనిక విన్యాసాలు ఏ పేరుతో మేఘాలయాలో తాజాగా నిర్వహిస్తున్నారు.?
జ : శక్తి

8) 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత్ కు అతిపెద్ద ఆర్దిక భాగస్వామిగా (118.4 బిలియన్ డాలర్ల) ఏ దేశం అవతరించింది.?
జ : చైనా

9) 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత్ కు రెండో అతిపెద్ద ఆర్దిక భాగస్వామిగా (118.3 బిలియన్ డాలర్ల) ఏ దేశం అవతరించింది.?
జ : అమెరికా

10) ఇండియా పర్యావరణ నివేదిక – 2024 ప్రకారం 2100 సంవత్సరానికి హిమాలయ పర్వతాల్లోని ఎంత శాతం మంచు కరిగిపోనుంది.?
జ : 75%

11) ఆంధ్రప్రదేశ్ లోని ఏ బంగారుగనిలో త్వరలోనే తవ్వకాలు ప్రారంభం కానున్నాయి.?
జ : జొన్నగిరి (కర్నూలు జిల్లా)

12) ఏప్రిల్ 2024లో టోకు ధరల ద్రవ్యోల్బణం ఎంతగా నమోదయింది.?
జ : 1.26%

13) శ్రీలంకకు చెందిన ఉగ్రవాద సంస్థ ఎల్టిటిఈ పై కేంద్రం ఎన్ని సంవత్సరాలు నిషేధం విధించింది.?
జ : ఐదేళ్లు

14) భారత్ కు చెందిన ఏ మూడు ఇతిహాసాలకు యునెస్కో ఆసియా పసిఫిక్ రిజిస్టర్ మెమరీలో చోటు దక్కింది.?
జ : రామ చరిత్ మానస్, పంచతంత్ర, సహృదయాలోక – లోచన