TODAY CURRENT AFFAIRS IN TELUGU 14th JANUARY 2024
1) అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ 2024 భారతదేశంలోని ఏ నగరంలో నిర్వహించారు.?
జ : గుజరాత్
2) దివ్యాంగులకు ఎలాంటి సమయంలో అయినా, ఏ సాయమైనా అందించడానికి జాతీయస్థాయిలో ప్రారంభమైన టోల్ ఫ్రీ నెంబర్ ఏది.?
జ : 1800 22 2014
3) అంతర్జాతీయ టి20 క్రికెట్ లో అత్యధిక సార్లు (12) డక్ అవుట్ అయిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రోహిత్ శర్మ
4) అంతర్జాతీయ టి20 లో 150 మ్యాచులు ఆడిన తొలి ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రోహిత్ శర్మ
5) మలేషియా బ్యాడ్మింటన్ ఓపెన్ టోర్నీ 2024 పురుషుల డబుల్స్ లో రన్నర్ గా నిలిచిన భారత జోడి ఏది.?
జ : సాత్విక్ సాయిరాజ్ & చిరాగ్ శెట్టి
6) గగన తలం నుండి గగనతలములోని వంద కిలోమీటర్ల లక్ష్యాన్ని చేదించగలరు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో బీడీఎల్ రూపొందించిన క్షిపణి పేరు ఏమిటి.?
జ : అస్త్ర
7) కొత్త రకం గబ్బిలం వైరస్ ను ఏ దేశంలో ఇటీవల కనిపెట్టారు.?
జ : థాయిలాండ్
8) ప్రపంచ ఆర్థిక వేదిక 54వ వార్షిక దశ సదస్సు 2024 ఎక్కడ ప్రారంభమైంది .?
జ :దావోస్ – స్విజర్లాండ్
9) ఇక్రా సంస్థ అంచనాల ప్రకారం 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో భారత దేశపు ద్రవ్యలోటు ఎంతగా ఉండనుంది.?
జ : 5.3%
10) ఇండోనేషియాలోని ఏ అగ్నిపర్వతం రెండోసారి ఇటీవల బద్దలైంది.?
జ: మౌంట్ మెరపి
11) అమెరికాలో ఒక వీధికి అనంతపురంకు చెందిన, అమెరికాలో స్థిరపడిన ఒక వైద్యుడి పేరు పెట్టారు. ఆయన పేరు ఏమిటి.
జ: డాక్టర్ జయరాం నాయుడు
12) డెన్మార్క్ నుతన రాజుగా ఎవరు నియమితులయ్యారు. ఇటీవల డెన్మార్క్ రాణి మార్గరెట్ – 2 రాజరికం పరిత్యజించిన విషయం చేసిన తెలిసిందే.?
జ :ప్రెడరిక్ -2
13) ఏ దేశం భారత సైన్యాన్ని మార్చి 15 కల్లా వెళ్లిపోవాలని ఆదేశించింది.?
జ : మాల్దీవులు
14) ఏ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పారు.?
జ : షాన్ మార్ష్