BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 13th SEPTEMBER 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 13th SEPTEMBER 2024
1) తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో ఎంత నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రకటించింది.?
జ : రూ.10,032 కోట్లు నష్టం
2) ట్రాన్స్‌జెండర్ల కోసం జిల్లాకో క్లినిక్ ఏర్పాటుచేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : తెలంగాణ ప్రభుత్వం
3) తాజాగా లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేవాలయం ఏది.?
జ : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం
4) కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ ద్వీపశ్రేణికి రాజధానిగా ఉన్న పోర్ట్‌బ్లెయిర్ నగరం పేరును కేంద్రం తాజాగా ఏమని మార్చింది.?
జ : శ్రీ విజయ పురం
5) సెప్టెంబర్ ఆరో తేదీతో ముగిసిన వారానికి భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు ఎన్ని బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ తెలిపింది.?
జ : 689.24 బిలియన్ డాలర్లకు
6) సౌత్ ఏషియన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఎన్ని పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది.?
జ :48 పతకాలు (21 స్వర్ణాలు సహా 22 రజతాలు, 5 కాంస్య పతకాలు)
7) సోషల్ మీడియాలో 100 కోట్ల ఫాలోవర్స్ కలిగిన పుట్ బాల్ ఆటగాడు ఎవరు.?
జ : క్రిస్టియనో రొనాల్డో
8) ఘనమైన సినిమా చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక సినిమా వేదిక ‘బియాండ్ ఫెస్ట్’లో
ఏ తెలుగు సినిమా కు రెడ్ కార్పెట్ ఈవెంట్ జరుపనున్నారు.?
జ : ‘దేవర -1’
9) జాతీయ సీనియర్ ఆక్వాటిక్స్ ఛాంపియన్స్ షిప్ 2024 లో తెలంగాణ స్విమ్మర్ వృత్తి అగర్వాల్ కు ఎన్ని పతకాలు దక్కాయి.?
జ : 5
10) ఆగస్టు 2024 లో దేశీయ విమాన మార్గాలలో ఎంతమంది ప్రయాణికులు ప్రయాణించారు.?
జ : 1.31 కోట్ల మంది
11) సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అమృత్ మోహన్ ప్రసాద్
12) వారంలో నాలుగు రోజులే పని దినాలను ప్రవేశపెట్టిన దేశం ఏది.?
జ : జపాన్
13) ఐఐటీ డిల్లీ తన మొదటి విదేశీ క్యాంపస్ ను ఎక్కడ ప్రారంభించింది.?
జ : అబుదాభి
14) కేరళ ప్రభుత్వం చేపట్టిన ఆఫరేషన్ పీ – హంట్ లక్ష్యం ఏమిటి.?
జ : చిన్నారుల అశ్లీల వీడియోలు, పోటోలు కోసం సెర్చ్ చేసిన వారిని అరెస్టు చేయడం
15) సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన రైతు కమిషన్ చైర్మన్ గా ఎవరిని నియమించింది.?
జ : జస్టిస్ నవాబు సింగ్