TODAY CURRENT AFFAIRS IN TELUGU 13th JANUARY 2024
1) యూనిసెఫ్ అంతర్జాతీయ కౌన్సిల్ సభ్యురాలిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : సుధారెడ్డి
2) ఆడిలైడ్ ఇంటర్నేషనల్ ఏటిపి 250 టోర్నీ 2024 రన్నర్ గా నిలిచిన పురుషుల డబుల్స్ జోడి ఏది.?
జ : బోపన్న – ఎబ్డెన్
3) హబుల్ టెలిస్కోప్ అత్యంత శక్తివంతమైన రేడియో తరంగాలను ఇటీవల అంతరిక్షంలో గుర్తించింది. వాటికి ఏమని పేరు పెట్టారు.?
జ : FRB20220610A
4) పద్మ విభూషణ్ గ్రహీత అయిన ప్రభా ఆత్రే మరణించారు. ఆమె హిందుస్తానీ సంగీతంలో కిరాణా ఘరానా అనే విభాగానికి పేరు తెచ్చారు. ఆమె జీవిత చరిత్ర పేరు ఏమిటి.?
జ : Along the Path of the Music
5) స్టాన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 (గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్) లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 80వ
6) ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏరోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 10
7) ప్రపంచ హిందీ దినోత్సవం 2024 థీమ్ ఏమిటి.?
జ : Hindi – Bridging Traditional Knowledge and Artificial Intelligence
8) వందే భారత్ రైలు మొదటి మహిళా లోకి పైలెట్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సురేఖా యాదవ్
9) జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులను పూర్తిస్థాయిలో ఏరువేయడానికి చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి.?
జ : ఆపరేషన్ సర్వశక్తి
10) తైవాన్ అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ విజయం సాధించింది. ఎవరు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.?
జ : లాయ్ చింగ్ తే
11) మిజోరాం యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆ రాష్ట్రంలో కొత్తరకం పాము జాతిని గుర్తించారు. దానికి ఏమని నామకరణం చేశారు.?
జ : సినోమైక్రరస్ గొరి
12) రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ గా ఎవరి పదవి కాలాన్ని పొడిగించారు.?
జ : మైఖేల్ దేబబ్రతా
13) మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ 2024లో ఫైనల్స్ కు చేరిన భారత పురుష డబుల్స్ జోడి ఏది.?
జ : సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడి
14) వాతావరణం మార్పుల కారణంగా పుట్టబోయే బిడ్డ బరువు 20% ఎక్కువగానో, తక్కువగానో పుడుతుందని ఏ దేశ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.?
జ : ఆస్ట్రేలియా
15) నాసా మొట్టమొదటి సారిగా శబ్దం చేయని సూపర్ సానిక్ విమాన తయారీ కోసం కృషి చేస్తుంది.దానికి ఏమని పేరు పెట్టారు.?
జ : X59 – Quite Supersonic Aircraft
16) ఆహార భద్రత ప్రమాణాల జాతీయ సంస్థ – భోగ్ సర్టిఫికెట్ ను తెలంగాణలోని ఏ దేవాలయాలకు తాజాగా కేటాయించింది.?
జ : వర్గల్ దేవాలయం, యాదాద్రి దేవాలయం