Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 13th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 13th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 13th FEBRUARY 2024

1) కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు సోలార్ విద్యుత్ను ఉచితంగా అందించడానికి కేంద్రం ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి.?
జ : పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన

2) యూఏఈ రాజధాని అబూదాబిలో నిర్మితమైన తొలి హిందూ దేవాలయాన్ని ఇటీవల నరేంద్ర మోడీ ప్రారంభించారు ఆలయం పేరు ఏమిటి.?
జ : బోచసన్యాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ సంస్థ దేవాలయం

3) గంటకు 623 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ వేగంగా ప్రయాణించే “మ్యాగ్ లెవ్ రైలు” ను ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది.?
జ : చైనా

4) రష్యా వాంటెడ్ జాబితాలో ఏ దేశ ప్రధాని పేరును ఇటీవల చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు.?
జ : కాజా కల్లాస్ (ఎస్తోనియా)

5) జాతీయ చలనచిత్ర అవార్డులలో అందించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నగదు పారితోషికాన్ని ఎంత నుండి ఎంతకు పెంచారు.?
జ : 10 లక్షల నుండి 15 లక్షలు

6) జాతీయ చలనచిత్ర అవార్డులలో అందించే ఉత్తమ మొదటి చిత్రం‌, జాతీయ సమైక్యత చిత్రాలకు ఇచ్చే అవార్డులకు ఉన్న ఎవరి పేర్లను తొలగించారు.?
జ : ఇందిరాగాంధీ, నర్గీష్ దత

7) ఇటీవల రష్యా, ఉక్రెయిన్ పై ఏ అత్యాధునిక క్షిపణిని ప్రయోగించింది.?
జ : జీర్ఖాన్ (గంటకు 9,900 కీమీ ల వేగంతో ప్రయాణిస్తుంది.)

8) భారత్ లో 2026 లో అందుబాటులోకి రానున్న బుల్లెట్ ట్రైన్ వేగం ఎంతగా కేంద్రమంత్రి పేర్కొన్నారు.?
జ : గంటకు 320 కిలోమీటర్లు

9) మార్కెట్ విలువ ప్రకారంగా 20 లక్షల కోట్లకు చేరిన తొలి భారతీయ కంపెనీగా ఏ కంపెనీ చేరింది.?
జ : రిలయన్స్

10) గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్ 2024లో దేశంలో తొలిసారి అనుభవించిన బిజినెస్ స్కూల్ ఏది?
జ : ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (హైదరాబాద్)

11) అంతర్జాతీయ టెన్నిస్ ర్యాంకింగ్ లలో తాజాగా 100 లోపు ర్యాంకులో నిలిచిన భారత ఆటగాడు ఎవరు.?
జ : సుమిత్ నగాల్