TODAY CURRENT AFFAIRS IN TELUGU 12th JUNE 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 12th JUNE 2024

1) ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఏ భారత బౌలర్ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు.?
జ : అర్షదీప్ సింగ్ (9/4)

2) ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా ఏ కంపెనీ నిలిచింది.?
జ : ఆపిల్

3) మానవ శరీరాభివృద్ధికి అవసరమైన ప్రోటీన్లు నాచులో అధికంగా ఉంటాయని ఏ శాస్త్రవేత్తలు ఇటీవల తమ పరిశోధనలో కనుగొన్నారు.?
జ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT)

4) 1980 – 2020 మధ్య వాతావరణం లో నైట్రస్ ఆక్సైడ్ ఎంత శాతం పెరిగిందని గ్లోబల్ కార్బన్ ప్రాజెక్టు నివేదిక తెలుపుతుంది.?
జ : 40 శాతం

5) గ్లోబల్ కార్బన్ ప్రాజెక్టు నివేదిక ప్రకారం నైట్రస్ ఆక్సైడ్ ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు ఏవి.?
జ : చైనా, భారత్, అమెరికా

6) అరుణాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియామకం అయ్యారు.?
జ : పెమా ఖండూ

7) ఇంటి పునాదులలో ఉపయోగించే కాంక్రీట్ లో విద్యుత్ ను నిల్వ చేయవచ్చు అని ఏ సంస్థ అధ్యయనంలో తేలింది.?
జ : మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

8) కంటైనర్ పోర్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో విశాఖపట్నం పోర్టు ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 19

9) ప్రపంచంలోనే బలమైన హోటల్ బ్రాండ్ గా భారత్ చెందిన ఏ హోటల్ బ్రాండ్ నిలిచింది.?
జ : తాజ్

10) అంతర్జాతీయ మెడ్ టెక్ సంస్థ అయిన ఒలంఫస్ తన పరిశోధన కేంద్రాన్ని భారతదేశంలోని ఏ నగరంలో ప్రారంభించనుంది.?
జ : హైదరాబాద్

11) 2024 మే మాసానికి గాను రిటైలర్ ద్రవ్యోల్బణం ఎంత శాతంగా నమోదయింది.?
జ : 4.75%

12) మంగోలియాలో “జెడ్” అనే వాతావరణ పరిస్థితికి కారణం ఏంటి.?
జ : తీవ్ర అనావృష్టి – వెంటనే అతి శీతల వాతావరణం ఏర్పడటం

13) మంగోలియాలో “జెడ్” అనే వాతావరణ పరిస్థితి కారణంగా ఎన్ని జంతువులు మరణించాయి.?
జ : 71 లక్షలు

14) అంగారక గ్రహం పై ఇటీవల గుర్తించిన అగ్ని బిలాలలో ఒకదానికి ఏ భారత శాస్త్రవేత్త పేరు పెట్టారు.?
జ : దేవేంద్ర లాల్

15) ఐపీఎల్ విలువ తాజాగా ఎంతకు చేరిందని బ్యాంకు హలిహన్‌లోకి సంస్థ నివేదిక తెలిపింది.?
జ : 1.34 లక్షల కోట్లు