BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 12th AUGUST 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 12th AUGUST 2024
1) EOS – 08 శాటిలైట్ ప్రయోగాన్ని ఇస్రో ఏ రోజు ప్రయోగించనుంది.?
జ: ఆగస్టు 16- 2024
2) ఏ భారతీయ టెలికం సంస్థ బ్రిటిష్ టెలికం లో 24.5% వాటాను కొనుగోలు చేసింది.?
జ : భారతి ఎయిర్ టెల్
3) 2036 నాటికి భారత్ లో స్త్రీ పురుష నిష్పత్తి ఎంతగా ఉండనుందని కేంద్రం ప్రకటించింది.?
జ : 952 : 1000 (ప్రస్తుతం 943 : 1000)
4) 2036 నాటికి భారత్ జనాభా ఎన్ని కోట్లకు చేరుతుందని కేంద్రం ఘనంగాలు చెబుతున్నాయి.?
జ : 152 కోట్లు
5) ఏ సంస్థ మెగా టెస్ట్ సెంటర్ ను తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.?
జ :హ్యుందాయ్
6) నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ తాజా ర్యాంకుల్లో ఏ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది.?
జ : ఐఐటీ-మద్రాస్
7) 2024 ఆగస్టు 15న ఢిల్లీలో వరుసగా ఎన్నో సారి మోదీ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.?
జ : 11వ సారి
8) ఏ అణువిద్యుత్తు కేంద్రంపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడి వల్లే ప్రమాదం జరిగినట్లు రష్యా ఆరోపిస్తున్నది.?
జ : జపొరిజియా
9) 2024 జూలై మాసానికి రిటైల్ ద్రవ్యోల్బణం ఎఔత శాతంగా నమోదైంది.?
జ : 3.54 శాతం
10) 2024 జూలై నెలకు గానూ మహిళల విభాగంలో ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు ఎవరు గెలుపొందారు.?
జ : శ్రీలంక మహిళ క్రికెటర్ చమేరీ ఆటపట్టు
11) 2024 జూలై నెలకు గానూ పురుషుల విభాగంలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు ఎవరు గెలుపొందారు.?
జ : ఇంగ్లండ్ యువ పేసర్ గస్ అట్కిన్సన్
12) అంతర్జాతీయ టెస్టు ఫార్మాట్‌లో ఎన్ని మ్యాచ్‌ల తర్వాత ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.?
జ : 28 (దాదాపు 384 రోజులకు టెస్టుల్లో తొలి డ్రా నమోదైంది) (వెస్టిండీస్, దక్షిణాఫ్రికా )
13) భారత పురుషుల హాకీ జట్టు తాజా ర్యాంకింగ్స్‌లో ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 5వ స్థానంలో