BIKKI NEWS TODAY CURRENT AFFAIRS IN TELUGU 11th SEPTEMBER 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 11th SEPTEMBER 2024
1) జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 11.
2) దేశంలో ఎన్ని సంవత్సరాలు పైడిన అందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వర్తింపజేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ?
జ : 70 ఏళ్ళు
3) ఎలక్ట్రిక్ బస్సులు, ఆంబులెన్సులు, ట్రక్కులు సహా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రూ.10,900 కోట్లతో ఏ పథకాన్ని అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.?
జ : పీఎం ఈ-డ్రైవ్ పథకం
4) 2024-25 నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో ఎన్నో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.?
జ : ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన – 4
5) ముంబైకు చెందిన ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్ ఇటీవల ఆవిష్కరించిన ఏ ఐ డ్రాప్స్‌కు డీసీజీఐ అనుమతి రద్దు చేసింది. ఈ ఐ డ్రాప్స్‌కు డీసీజీఐ ఆగస్టులో అనుమతి ఇచ్చింది.?
జ : ‘ప్రెస్‌వు’
6) ఖలిస్థాన్ అనుకూల ఏ సంస్థ పై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేండ్లు పొడిగించింది.?
జ : సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే)
7) భారత తొలి ఏరో స్పైక్ రాకెట్ ఇంజిన్ ప్రయోగం విజయవంతమైంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రొపల్షన్ టెస్ట్ ఫెసిలిటీలో ఈ ప్రయోగాన్ని ఏ స్టార్టప్ విజయవంతంగా పరీక్షించింది.?
జ : స్పేస్ ఫీల్డ్స్ స్టార్టప్
8) ఆల్‌ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ టోర్నీ 2024 విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : హైదరాబాద్ క్రికెట్ జట్టు
9) భారత్ లో నిర్వహించిన వన్డే ప్రపంచ కప్ 2024 ద్వారా భారత్ కు ఎంత ఆదాయం సమకూరినట్లు ఐసీసీ ప్రకటించింది.?
జ : 11,637 కోట్లు
10) 5G స్మార్ట్ పోన్ అత్యధికంగా కలిగిన మొదటి రెండు దేశాలు ఏవి .?
జ : చైనా (32%), భారత్ (13%)
11) సింగపూర్ లిటిరేచర్ అవార్డు 2023 కు ఎంపికైన భారత సంతతి రచయిత్రి ఎవరు.?
జ : ప్రశాంతీ రామ్ – రచన నైన్ యార్డ్ శారీస్
12) సింగపూర్ లిటిరేచర్ అవార్డు 2023 నాన్ ఫిక్షన్ విభాగంలో ఎంపికైన భారత సంతతి రచయిత్రి ఎవరు.?
జ : శుబిగి రావు – రచన – పల్ప్ – 3 : యాన్ ఇంటిమెట్ ఇన్వెంటరీ ఆఫ్ ద బానిష్‌డ్ బుక్
13) తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఏ రోజు జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : సెప్టెంబర్ 17
14) గాంధీ ప్రయాణాలకు గుర్తుగా డిల్లీలో రైలు పెట్టె ను ఏ పేరుతో ఆవిష్కరించారు.?
జ : గాంధీ దర్శన్