Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 11th MARCH 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 11th MARCH 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 11th MARCH 2024

1) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2023 కు గాను అనువాద విభాగంలో ఎవరికి దక్కింది.?
జ : ఎలనాగ (నాగరాజు సురేంద్ర)

2) తెలంగాణకు చెందిన కవి ఎలనాగ అనువదించిన ఏ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2023 తగ్గింది.?
జ : గాలిబ్ నాటి కాలం (గాలిబ్ ద మ్యాన్ – ద టైమ్)

3) పౌరసత్వ సవరణ చట్టం 2019 అమల్లోకి వచ్చినప్పుడు కేంద్రం ప్రకటించింది ఎన్ని మతాల వలసవాదులకు ఈ చట్టం వర్తించనుంది.?
జ : 6 మతాలు

4) దివ్యాస్త్రంగా భావించే ఖండాంత క్షిపణి మని భారత రక్షణ విభాగం పరీక్షించింది. ఆ క్షిపణి పేరు ఏమిటి?
జ : అగ్ని 5

5) అగ్ని – 5 క్షిపణి పరిధి ఎంత.?
జ : 5,500 – 8,000 కీమీ

6) 96వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏది.?
జ : ఓపెన్ హైమర్

7) 96వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ నటుడు, నటి, దర్శకుడిగా ఎవరు అవార్డులు సొంతం చేసుకున్నారు.?
జ : కిలియన్ మర్ఫీ, ఎమ్మా స్టోన్స్, క్రిస్టోఫర్ నోలన్

8) 96వ ఆస్కార్ అవార్డులలో ఏడు అవార్డులు గెలుచుకున్న చిత్రం ఏది.?
జ : ఓపెన్ హైమర్

9) సిప్రి నివేదిక ప్రకారం 2019-2023 మద్య ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశం ఏది?
జ : భారతదేశం

10) సిప్రి నివేదిక ప్రకారం 2019-2023 మద్య ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు ఎగుమతి చేస్తున్న దేశం ఏది?
జ : అమెరికా

11) నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి తాజాగా ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : సత్యార్థి మూవ్మెంట్ ఫర్ గ్లోబల్ కంపాషన్

12) అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఎంత.?
జ : 2.69 లక్షలు

13) ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ విభాగంలో అత్యుత్తమ విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం నిలిచింది.?
జ : శంషాబాద్ విమానాశ్రయం