TODAY CURRENT AFFAIRS IN TELUGU 11th JANUARY 2024
1) ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీ – 2024 ఎక్కడ ప్రారంభమైంది.?
జ : దోహా (ఖతర్)
2) స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 ర్యాంకులలో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది.? జ : ఇండోర్ సూరత్
3) ఫోన్ పే నూతన సీఈవోగా ఎవరు నియమితులయ్యారు జ : రితేష్ పాయ్
4) స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 ర్యాంకులలో హైదరాబాద్, విశాఖపట్నం లు ఎన్నో స్థానంలో నిలిచాయి.?
జ : 9, 4
5) రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జైపూర్ రాజకుమారి ఎవరు.?
జ : దియా కుమారి
6) ఏ దేశం నుండి భారత్ లోకి నేరుగా యూపీఐ ద్వారా నగదు బదిలీ చేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆమోదం తెలిపింది.?
జ : సింగపూర్
7) 100 బిలియన్ డాలర్ల (8.3.లక్షల కోట్లు) సంపద కలిగిన జాబితాలో భారత్ నుండి చేరిన తొలి సంపన్నుడు ఎవరు.?
జ : ముఖేష్ అంబానీ
8) ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ ను అధిగమించి ఏ కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది.?
జ : మైక్రోసాఫ్ట్
9) జాగ్రెబ్ ఓపెన్ ర్యాంకింగ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం నెగ్గిన భారత రెజ్లర్ ఎవరు.?
జ : అమన్ సెహ్రవత్
10) ఎక్కడ నిర్మించిన దేశంలో అతి పొడవైన సముద్రపు వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.?
జ : ముంబై (ముంబై ట్రాన్స్ హర్బర్ లింక్)
11) 21వ బయో ఏసియా సదస్సు 2024 ఫిబ్రవరి 26 నుండి 28 వరకు ఏ నగరంలో నిర్వహించనున్నారు.?
జ : హైదరాబాద్
12) స్మార్ట్ ఫోన్లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో పనిచేసే పరికరాన్ని ఏ కంపెనీ ఇటీవల విడుదల చేసింది.?
జ : రాబిట్
13) దేశ రత్న 2024 అవార్డు అందుకున్న తెలంగాణకు చెందిన 3D ఆర్టిస్ట్ ఎవరు.?
జ : సింగారపు శివరామకృష్ణ