BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 11th AUGUST 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 11th AUGUST 2024
1) తాజాగా ఎన్ని రకాల నూతన వంగడాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.?
జ : 109 రకాలు
2) ఇటీవల కన్నుమూసిన మాజీ విదేశాంగ శాఖ మంత్రి ఎవరు.?
జ : నట్వర్ సింగ్
3) దేశంలోనే తొలి సొలార్ గిగా ఫ్యాక్టరీ పనులను ప్రారంభించేందుకు ఏ సంస్థ శ్రీకారం చుట్టింది.?
జ : ‘రిలయన్స్’
4) పారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడలను ఎన్ని రోజులపాటు నిర్వహించారు.?
జ : 17 రోజులు
5) పారిస్ ఒలింపిక్స్ 2024 లో మొదటి స్థానంలో నిలిచిన దేశాలు ఏవి.?
జ : యూఎస్ఏ 40 గోల్డ్ మెడల్స్‌తో చైనాతో సంయుక్తంగా టాప్‌లో నిలిచింది.
6) పారిస్ ఒలింపిక్స్ 2024 లో మూడో స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : 20 పసిడి పతకాలతో జపాన్ మూడో స్థానంలో ఉంది.
7) టోక్యో ఒలింపిక్స్ లో 7 పతకాలు సాదించిన భారత్ ఈసారి ఎన్ని పతకాలు సాదించింది.?
జ : ఆరు పతకాలు (1 సిల్వర్, 5 కాంస్యాలు)
8) పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 71వ ర్యాంక్
9) 2028, 2032 లో జరుగనున్న ఒలింపిక్స్‌కు ఏ నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.?
జ : 2028 – అమెరికాలోని
లాస్ ఏంజిల్స్. 2032 – ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ సిటీ
10) ఒలింపిక్స్ లో పురుషుల మరథాన్ లో విజేతగా ఎవరు నిలిచారు.?
జ : తమిరాత్ తోలా (ఇథియోపియా)
11) ఏ భారత క్రీడాకారుడికి ఒలింపిక్ ఆర్డర్ ను ఒలింపిక్ సంఘం అందజేసింది.?
జ : అభినవ్ బింద్రా
12) ఇరాన్ దేశపు అణు విభాగం చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మహ్మద్ ఎస్లామీ
13) భారత అధ్యక్షురాలుకు తిమోర్ లెస్ట్ దేశం ప్రకటించిన అత్యున్నత పౌర పురష్కారం ఏది.?
జ : గ్రాండ్ – కాలర్ ఆఫ్ ద ఆర్డర్
14) ఒలింపిక్స్ లో మహిళల మరథాన్ లో విజేతగా ఎవరు నిలిచారు.?
జ : సిఫాన్ హసన్ (నెదర్లాండ్స్)