TODAY CURRENT AFFAIRS IN TELUGU 10th SEPTEMBER 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 10th SEPTEMBER 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 10th SEPTEMBER 2024

1) సైబర్‌ నేరాల అదుపునకు విశేష కృషి చేస్తున్న తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది..?
జ : ‘సమన్వయ ప్లాట్‌ఫామ్‌’

2) కోఠి మ‌హిళా యూనివ‌ర్సిటీకి ఎవరి పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : చాక‌లి ఐల‌మ్మ పేరు

3) తెలంగాణ రాష్ట్రం లో మోడ‌ల్ సోలార్ విలేజ్‌గా ఏ గ్రామాన్ని ఎంపిక చేశారు.?
జ : కొండారెడ్డిప‌ల్లి

4) రోడ్డు ప్రమాదాలలో దేశంలో ప్రతి గంటకు ఎన్ని ప్రమాదాలు, ఎన్నిమరణాలు సంభవిస్తున్నాయి.?
జ : 53, 19

5) యూఎస్‌ న్యూస్‌ & వరల్డ్‌ రిపోర్ట్‌ వెలువరించిన ‘ఉత్తమ దేశాల ర్యాంకింగ్స్‌ 2024’లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : స్విట్జర్లాండ్‌

6) యూఎస్‌ న్యూస్‌ & వరల్డ్‌ రిపోర్ట్‌ వెలువరించిన ‘ఉత్తమ దేశాల ర్యాంకింగ్స్‌ 2024’లో భారత్ కు ఎన్నో స్థానం దక్కింది.?
జ : 33వ స్థానం

7) ఇన్‌స్టాగ్రామ్‌’ ద్వారా భర్తకు విడాకులు పంపి సంచలనం సృష్టించిన దుబాయ్‌ యువరాణి షేక్‌ మెహ్రా అల్‌ మక్తోమ్‌ తాజాగా ఏ పేరుతో సరికొత్త పర్‌ఫ్యూమ్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు.?
జ : ‘డివోర్స్‌’

8) 16 ఏండ్లలోపు పిల్లలు సోషల్‌మీడియా వినియోగంపై ఏ దేశం నిషేధం విధించింది.?
జ : ఆస్ట్రేలియా

9) పారా ఒలింపిక్స్ లో భారత్‌ తరఫున పతకాలు సాదించిన వారికి కేంద్రం ప్రకటించిన నజరానా ఏమిటి.?
జ : బంగారు పతకం – రూ. 75 లక్షలు, వెండి పతకం – రూ. 50 లక్షలు, కాంస్యంతో పతకం – రూ. 25 లక్షలు

10) ప్రపంచస్థాయి బెస్ట్‌ బిజినెస్‌ స్కూల్‌లో చోటు దక్కించుకున్న కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఇనిస్టిట్యూట్ ఏది.?
జ : ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌’ (ఐఐఎఫ్‌టీ)

11) తొలిసారిగా ప్రైవేటు స్పేస్ వాక్ కోసం నలుగురు వ్యోమోగాములను ఏ రాకెట్ ద్వారా స్పేస్ ఎక్స్ సంస్థ అంతరిక్షంలోకే పంపింది.?
జ : ఫాల్కన్ – 9

12) బ్రెయిలీ డెబిట్ కార్డును ఏ బ్యాంకు ప్రవేశపెట్టింది.?
జ : పంజాబ్ నేషనల్ బ్యాంకు

13) ప్రపంచ తొలి ట్రైఫోల్డ్ ఫోన్ ను ఏ సంస్థ ఆవిష్కరించింది.?
జ : హువావే

14) గత 20 ఏళ్ళలో గాలిలోకి ఎంత మీథేన్ విడుదల అయినట్లు తేలింది.?
జ : 67 కోట్ల టన్నులు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు