Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 10th JUNE 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 10th JUNE 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 10th JUNE 2024

1) గోల్డెన్ వింగ్స్ అవార్డు పొందిన నౌకదళానికి చెందిన తొలి మహిళా హెలికాప్టర్ పైలెట్ ఎవరు.?
జ : అనామిక బి. రాజీవ్

2) ప్రపంచ సముద్రాల దినోత్సవం జూన్ – 08 న జరుపుకుంటారు. 2024 థీమ్ ఏమిటి.?
జ : Awaken new depth

3) తాజాగా భారత్ లో మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని లక్షల కోట్లకు చేరాయి.?
జ : 58.91 లక్షల కోట్లు

4) భారత టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగాల్ వరల్డ్ టెన్నిస్ ర్యాంకింగులలో ఏ ర్యాంక్ సాదించాడు.?
జ : 77వ

5) SSO గణాంకాల ప్రకారం 2023 – 24 లో భారత జీడీపీ వృద్ది రేటు ఎంత.?
జ : 8.2%

6) కెనడా గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : మాక్స్ వెర్‌స్టాఫెన్

7) టెన్నిస్ లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ అందుకున్న తొలి ఇటలీ ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : యానిక్ సినెర్

8) కేంద్ర నూతన క్రీడా శాఖ మంత్రి గా ఎవరు నియమితులయ్యారు ?
జ : మనసూఖ్ మాండవీయా

9) సిక్కిం నూతన ముఖ్యమంత్రి గా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు.?
జ : ప్రేమ్‌సింగ్ కుమార్ తమాంగ్

10) ప్రాన్స్ పార్లమెంట్ దిగువ సభను రద్దు చేశారు. దానికి ఏమని పేరు.?
జ : నేషనల్ అసెంబ్లీ

11) జిరోధా బ్రోకరేజ్ సంస్థ కో పౌండర్ 14 వేల కోట్లను దానం చేశారు. అతని పేరు ఏమిటి.?
జ : నిఖిల్ కామత్

12) మోటో జీపీ భారత్ – 2025 పోటీలకు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది.?
జ : నోయిడా

13) ఉత్తరప్రదేశ్ లో 5వ టైగర్ రిజర్వ్ గా తాజాగా దేనిని ప్రకటించారు.?
జ : సుహెల్వా వైల్డ్ లైఫ్ శాంక్చ్యుయరి