BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 10th JULY 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 10th JULY 2024
1) దేశంలో తొలి మహిళ ట్రాన్స్ జెండర్ ఎస్సైగా ఎవరు నియమితులయ్యారు.?
జ : మన్వీ మధు కశ్యప్
2) శరీరం మీది చెమటతో రక్తంలోని షుగర్ లెవల్స్ ను తెలిపే లేజర్ బ్యాండేజ్ ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : సింగపూర్
3) ఏ సెక్షన్ ప్రకారం మతంతో సంబంధం లేకుండా విడాకులు తీసుకున్న మహిళలకు భరణం అందించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.?
జ : సీఆర్పీసీ సెక్షన్ 125
4) ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రియా పర్యటనలో భాగంగా ఆ దేశ చాన్సలర్ తో భేటీ అయ్యారు. ఆయన పేరు ఏమిటి.?
జ : కార్ల్ నెహమర్
5) ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడి తో భేటీ అయ్యారు. ఆయన పేరు ఏమిటి.?
జ : అలెగ్జాండర్ వాండెర్
6) భారత్ 2035 వరకు ఏర్పాటు చేయనున్న భారత అంతరిక్ష కేంద్రం భూమి నుండి ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉండనుంది.?
జ : 450 కిలోమీటర్లు
7) తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా ఎవరు నియమితులయ్యారు.?
జ : జితేందర్
8) ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) నూతన అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఎలిసా డీ ఆండా మద్రాజో (మెక్సికో)
9) అమెరికాలోని హ్యుస్టన్ నగరాన్ని ఏ తుఫాన్ అతలాకుతలం చేసింది.?
జ : బెరైల్
10) రష్యాలోని ఏ నగరాలలో నూతనంగా భారత రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు.?
జ : కజన్ & యొకా టెరెన్ బర్గ్
11) క్రోనిక్ డిసీజ్ ఎవర్నెస్ డే ఏరోజు జరుపుకుంటారు.?
జ : జూలై 10
12) ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన స్పాన్సర్ గా ఎవరు అవకాశం దక్కించుకున్నారు.?
జ : బిపిసిఎల్
13) జులై 9 నుండి 11 వరకు జరిగే నాటో సదస్సుకు ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : వాషింగ్టన్ డిసి
14) ఉత్తర ప్రదేశ్ నేపాల్ సరిహద్దుల్లో వృక్షాలను భారీగా పెంచడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం పై పేరు ఏమిటి.?
జ : మిత్ర వన్