BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 10th AUGUST 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 10th AUGUST 2024
1) కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్‌ను
2) ఇటీవల దాదాపు 15 వేల మందికి సోకి ఆఫ్రికన్ దేశాలను వణికిస్తున్న వ్యాధి ఏది.?
జ : మంకీపాక్స్
3) ఇటీవల కన్నుమూసిన యూట్యూబ్ మాజీ సీఈవో ఎవరు.?
జ : సుసాన్ వోజ్కికీ
4) తన పదవికి రాజీనామా చేసిన బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ ఎవరు.?
జ : ఒబైదుల్ హసన్
5) తన పదవికి రాజీనామా చేసిన బంగ్లాదేశ్ బ్యాంక్ గవర్నర్ ఎవరు.?
జ : అబ్దుర్ రౌఫ్ తాలూక్దార్
6) గౌతమ్ అదానీకి చెందిన విదేశీ డొల్ల కంపెనీల్లో సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బచ్, ఆమె భర్తకు వాటాలున్నట్టు ఏ సంస్థ తాజాగా పేర్కొన్నది.?
జ : హిండెన్ బర్గ్
7) పారిస్ ఒలింపిక్స్ లో రజతం సాదించిన భారత జావెలిన్ త్రోయర్ ఎవరు.?
జ : నీరజ్ చోప్రా (89.45 మీటర్లు)
8) జావెలిన్ త్రో లో ఒలింపిక్స్ & ప్రపంచ రికార్డు తో స్వర్ణం నెగ్గిన పాకిస్థాన్ ఆటగాడు ఎవరు.?
జ : అర్షద్ నదీమ్ (92.97 మీటర్లు)
9) భారీ గ్యాస్ నిక్షేపాలను చైనా ఇటీవల ఏ సముద్రంలో కనుగొన్నది.?
జ : దక్షిణ చైనా సముద్రం
10) ఒలింపిక్స్ లో పురుషుల మరథాన్ స్విమ్మింగ్ లో స్వర్ణం నెగ్గిన ఆటగాడు ఎవరు.?
జ : క్రిప్టోవ్ రసోవ్‌స్కీ (హంగేరీ)
11) పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత్ మొత్తం ఎన్ని పతకాలు గెలుచుకుంది.?
జ : 6
12) ఇటీవల ఏ జీవ వైవిధ్య ప్రదేశానికి యూనెస్కో ప్రపంచ వారసత్వ హోదా ప్రకటించింది.?
జ : ద ప్లో కంట్రీ
13) పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత్ మొత్తం 6 పతకాలు గెలుచుకుని ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 71వ స్థానంలో