TODAY CURRENT AFFAIRS IN TELUGU 10th APRIL 2024
1) ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో హౄపటైటీస్ – బీ, సీ తో బాధపడుతున్న దేశాల జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి.?
జ : చైనా, భారత్
2) రష్యా ప్రయోగించాల్సిన ఏ భారీ రాకెట్ ప్రయోగం సాంకేతిక కారణంగా నిలిచిపోయింది.?
జ : అంగార – AT
3) ప్రపంచ అథ్లెటిక్స్ సంఘం పారిస్ ఒలంపిక్స్ 2024 లో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారులకు ఎంత నగదు బహుమతిని అందజేయాలని నిర్ణయం తీసుకుంది.?
జ : 50,000 డాలర్లు
4) ప్రపంచ అథ్లెటిక్స్ సంఘం ఏ ఒలంపిక్స్ నుంచి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించిన క్రీడాకారులకు నగదు బహుమతిని అందజేయాలని నిర్ణయం తీసుకుంది.?
జ : లాస్‌ఎంజెల్స్ – 2028
5) క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024 లో బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో టాప్ 50 లో నిలిచిన భారత యూనివర్సిటీలో ఏవి.?
జ : IIM – అహ్మదాబాద్ (25), IIM – బెంగళూరు, IIM – కోల్‌కతా
6) క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024 లో ఎన్ని భారత యూనివర్సిటీలో చోటు సంపాదించుకున్నాయి.?
జ : 69
7) డిల్లీ అటవీ పరిరక్షణ కమిటీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నజ్మీ వజీరీ
8) ఏ మిశ్రమ లోహంతో తయారు చేసిన కృత్రిమ రిఫ్రిజిరేటర్ ను విజయవంతంగా సార్ల్యాండ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది.?
జ : NITINOL (NICKEL + TITANIUM)
9) కన్యాదానం హిందూ వివాహంలో ముఖ్యం కాదని ఏ కోర్టు తీర్పు ఇచ్చింది.?
జ : అలహాబాద్ హైకోర్టు
10) భారత సైన్యం ఏ దేశం నుంచి స్వల్ప శ్రేణిలో దాడి చేసి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసింది.?
జ : IGLA – S – AIR DEFENCE
11) క్లీన్ ఎకానమిక్ ఫోరమ్ 2024 ను IPEF (Indo Pasific Economic Forum) ఎక్కడ నిర్వహించింది.?
జ : సింగపూర్
12) ఇంటర్నేషనల్ సేప్టీ పిన్ డే ను ఏ రోజున నిర్వహిస్తారు. ?
జ : ఎప్రిల్ 10
13) సేప్టీ పిన్ (పిన్నిస్) ను తయారు చేసింది ఎవరు .?
జ : వాల్టర్ హంట్ (అమెరికా)
14) తాజా గణంకాల ప్రకారం భారత్ వివిధ విపత్తుల వలన ఎన్ని చదరపు కీ.మీ. భూమి ని కోల్పోయింది.?
జ : 1500 చదరపు కీ.మీ.
15) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024.లో హనరరీ పాల్మే డీ ఓర్ గౌరవం ఎవరికి దక్కింది.?
జ : జార్జ్ లుకాస్