RAIN HOLIDAYS : నేడు, రేపు అన్ని విద్యా సంస్థలకు సెలవు

హైదరాబాద్ (జూలై – 20) : తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు మంజూరు చేసింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ, రేపు (గురువారం, శుక్రవారం) పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీ లకు సెలవులు ప్రకటించారు. విద్యా సంస్థలు తిరిగి శనివారం తెరుచుకోనున్నాయి.