హైదరాబాద్ (ఎప్రిల్ – 21) : ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణ మరియు రెగ్యులర్ అధ్యాపకుల బదిలీలు ఇతర సమస్యల పరిష్కారం కొరకు ఈరోజు హైదరాబాదులో గౌరవ ఆర్థిక శాఖ మాత్యులు హరీష్ రావు మరియు గౌరవ విద్యాశాఖ మాత్యులు సబితా ఇంద్రారెడ్డి, శాసన మండలి ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి వినతి పత్రాలు ఇచ్చినట్టు “తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి” సమన్వయకర్త మైలారం జంగయ్య మరియు రాష్ట్ర కన్వీనర్లు మాచర్ల రామకృష్ణ గౌడ్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ లు తెలిపారు.
ఈరోజు హైదరాబాదులో గౌరవ మంత్రులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని మరియు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారిని మరియు శాసనమండలి లో చీఫ్ విప్ డాక్టర్ పల్లా రాజేష్ రెడ్డి గారిని కలిసిన సందర్భంగా చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్దీకరణ విషయాన్ని , గౌరవ ముఖ్యమంత్రివర్యులు గారి దృష్టికి తీసుకువెళ్లి త్వరగా క్రమబద్దీకరణ ఉత్తర్వులు వచ్చేటట్లు చూడవలసిందిగా విన్నవించడం జరిగింది.
అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా రెగ్యులర్ అధ్యాపకులకు, ప్రిన్సిపాల్ లకు బదిలీ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బదిలీలు జరిగేటట్లు ప్రయత్నించవలసిందిగా కోరారు. అనంతరం ప్రభుత్వ విద్యా వ్యవస్థలో, ఇంటర్విద్యా వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు వివరించడం జరిగింది. ఈసందర్భంగా ప్రభుత్వ పెద్దల సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు.
ప్రభుత్వ పెద్దలను కలిసిన వారిలో తెలంగాణ ఇంటర్విద్య పరిరక్షణ సమితి మరియు టిగ్లా మరియు GCCLA-475 475 అసోసియేషన్ నాయకులు మైలారం జంగయ్య, రామకృష్ణ గౌడ్, జీ రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు సంగీత, మనోహర్, సైదులు, ముడి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.