TIMES PERSON OF THE YEAR 2023 – TAYLOR SWIFT

BIKKI NEWS (DEC-06) : అమెరికాకు చెందిన ప్రముఖ నటి, గాయని, రచయిత్రి టేలర్ స్విఫ్ట్ 2023 ఏడాదికి టైమ్ మ్యాగజైన్ ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’గా (TIMES PERSON OF THE YEAR 2023 – TAYLOR SWIFT) ఎంపికయ్యారు.

ప్రపంచంలోని ప్రముఖులు పోటీపడినప్పటికీ చివరకు ఆమె విజేతగా నిలిచారు. ఫైనల్ కు ఎన్నికైన బార్బీ, కింగ్ ఛార్లెస్-3, ఓపెన్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సామ్ ఆల్ట్‌మాన్ తదితర తొమ్మిది మంది నుంచి టేలర్ స్విఫ్ట్ ను విజేతగా ఎంపిక చేసినట్టు టైమ్ ప్రకటించింది.

‘ఆమెపై ఆదరణ దశాబ్దాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నది’ అంటూ ఆమె ఎన్నిక సందర్భంగా టైమ్ వ్యాఖ్యానించింది. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో అత్యధికంగా ప్రాతినిధ్యం వహించిన కళాకారిణి అని స్పాటిఫై ప్రకటించిన వారం తర్వాత బుధవారం టైమ్ మ్యాగజైన్ టేలర్ స్విఫ్ట్ ను పర్సన్ ఆఫ్ ద ఇయర్ ప్రకటించడం విశేషం.