టైమ్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా జెలెన్స్ స్కీ

న్యూఢిల్లీ (డిసెంబర్ – 08) : TIMES PERSON OF THE YEAR 2022 గా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని టైమ్ మ్యాగజైన్ ప్రకటించింది.

దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ జెలిన్ స్కీని హీరోగా కొనియాడుతున్నారని, రష్యా సైనిక చర్యకు వెరువకుండా ఆయన దేశాన్ని ముందుండి నడిపిస్తున్నారని టైమ్ మ్యాగజైన్ పేర్కొన్నది.

తాలిబన్లు ఆప్ఘనిస్థాన్ ను హస్తగతం చేసుకున్నప్పుడు ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారని, అలాగే 2014లో నిరసనకారులు తన ఇంటిని చుట్టుముట్టేందుకు వస్తున్న సమయంలో నాటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టోర్ యనుకోవిచ్ కూడా కవ్ నగరాన్ని వీడారని గుర్తుచేసింది. అయితే జెలెన్ స్కీ రష్యా బలగాలకు ఎదురొడ్డి నిలిచారని కొనియాడింది.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @