ఇంటర్ విద్యా వ్యవస్థలో సమస్యల పరిష్కారం కోసం 22న నిరసన కార్యక్రమం

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో బోధన – బోధనేతర సిబ్బంది, రెగ్యులర్, కాంట్రాక్ట్, అతిథి అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణ పరిష్కారం కోసం 22.01.2021 రోజున భోజన విరామ సమయంలో నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కమీషనరేట్ ఆవరణలో “నిరసన కార్యక్రమం” చేపటడుతున్నట్లు తెలంగాణ ఇంటర్ విద్య ప్రభుత్వ లెక్చరర్ల సంఘం (TIGLA) అధ్యక్షుడు జంగయ్య తెలిపారు.

క్రింద ఇవ్వబడ ప్రధాన డిమాండ్స్ ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి మరియు ఇంటర్ విద్యా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేయడమే ఈ నిరసన కార్యక్రమం లక్ష్యమని TIGLA అధ్యక్షుడు జంగయ్య ఒక ప్రకటనలో తెలిపారు.ముఖ్యమంత్రివర్యులు ఆదేశం మేరకు ఈ నెల 31వ తేది లోపు DIEO లకు RJD/ప్రిన్సిపాల్ లకు DIEO/జూనియర్ అధ్యాపకులకు PRINCIPAL/DL/DyDIEO నాన్-టీచింగ్ స్టాఫ్ కు జూనియర్ అధ్యాపకులు/లైబ్రేరియన్ గా పదోన్నతులు కల్పించాలి.

 • ఇంటర్మీడియట్ వ్యవస్థలో అక్రమ పదోన్నతులు/బదిలీలు/సస్పెన్షన్ లు /ఛార్జ్ మెమోలను రద్దు చేయాలి. అవినీతి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి.
 • ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పదవీ విరమణ పొంది BIE/CIE పనిచేస్తున్న సుశీల్ కుమార్,OSD మరియు బహుగుణలను తక్షణమే తొలిగించాలి.
 • కాంట్రాక్టు అధ్యాపకులకు ముఖ్యమంత్రివర్యులు ఆదేశాల మేరకు నియమ, నిబంధనలను ప్రకటించి స్థానచలనం (బదిలీలు చేయాలి). G.O.Ms.No.16 పై వున్న కోర్టు కేసు పరిష్కరానికి కృషి చేస్తూ క్రమబద్దీకరణ చేయాలి. తక్షణమే కాంట్రాక్టు అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ DA/HRA/ HEALTH CARD లను ఇవ్వాలి.
 • రెగ్యులర్ DIEOలు పోను మిగతా DIEO/Nodal Officer పోస్టులకు ప్రిన్సిపాల్ ల రాష్ట్ర స్థాయి సీనియార్టీ ప్రకారం కౌన్సిలింగ్ ద్వారా FAC/Incharge ఇవ్వాలి.
 • ఇంటర్మీడియట్ విద్యా మండలి(బోర్డు)లో డిప్యూటేషన్ లను రద్దు చేయాలి.
 • VI వ జోన్ RJDIE కార్యాలయాన్ని మాత్రమే వరంగల్ నుండి హైదరాబాద్ కు మార్చాలి.
 • ప్రస్తుత పరిస్థితులలో కళాశాలలకు శానిటైజషన్ కు తదితర పనులకు గాను ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి.
 • ప్రస్తుతం పనిచేస్తున్న అతిధి అధ్యాపకులను కొనసాగించాలి.
 • ఖాళీలుగా వున్న బోధన, బోధనేతర సిబ్బంది నియమాపకానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
 • రాబోవు వార్షిక పరీక్షలకు అన్ని రకాల విధుల కేటాయింపు సీనియార్టీ ప్రకారం బోర్డు నుండే ఉత్తర్వులు ఇవ్వాలి.
 • మంజూరి కానీ DIEO/Nodal Officer పోస్టులలో FAC/ Incharge గా పనిచేస్తున్న అధికారులకు FAC/పుడ్/వాహన అలవెన్స్ లు మంజూరి చేయాలి.
Follow Us@