విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఇవ్వకుంటే మెరుపు ఉద్యమం – TIGLA

రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న 2 లక్షల మంది నిరుపేద విద్యార్థులకు (బేసిక్ లెర్నింగ్ మెటీరియల్) స్టడీ మెటీరియల్ ను వెంటనే కళాశాలలకు పంపిణీ చేయాలని తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోషియేషన్ (TIGLA) తరపున జంగయ్య, రామకృష్ణ గౌడ్ విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా తెలిపారు.

ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు నిర్లక్ష్యంతో కళాశాలలకు ఇప్పటివరకు పంపక పోవడం వలన విద్యార్థులు మానసిక ఆందోళన చెందుతూ తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని. గత సంవత్సరం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను బోర్డు వెబ్ సైట్ పెట్టి విద్యార్థులకు ఇవ్వకుండ వార్షిక పరీక్షలు పూర్తయిన తర్వాత తూతూమంత్రంగా కొన్ని కళాశాలలకు స్టడీ మెటీరియల్ పంపి బోర్డు అధికారులు చేతులు దులుపుకున్నారని గుర్తు చేశారు.

దీని ప్రభావం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులపై పడి ఫలితాలలో తక్కువ ఉత్తీర్ణత శాతం రావడంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై ఆందోళనతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని తెలిపారు.

ప్రస్తుత అత్యవసర పరిస్థితులలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ (బేసిక్ లెర్నింగ్ మెటీరియల్) ఉపయోగపడే అవకాశం వుంది. కావున కమీషనర్, ఇంటర్మీడియేట్ బోర్డు తక్షణమే స్టడీ మెటీరియల్ ను ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పంపి విద్యార్థులకు ఇవ్వకుంటే గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (TIGLA)” ఆధ్వర్యంలో మెరుపు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమని తెలియజేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.

Follow Us @