12న “సంస్కృతం” రద్దు కోసం ఇంటర్ కార్యాలయం వద్ద నిరసన – TIPS & TIGLA

ఇంటర్మీడియట్ కమీషనర్ అనాలోచిత, అసమర్థ నిర్ణయంతో ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతంను ప్రవేశ పెడుతూ ఇచ్చిన మెమోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వివరణ పేరుతో తప్పించుకుంటే సరిపోదని TIPS & TIGLA సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.

దశాబ్ద కాలం పైగా రెగ్యులర్, కాంట్రాక్ అధ్యాపకులు పోను ఖాళీగా ఉన్న 1700 జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయకుండా సంస్కృత జూనియర్ లెక్చరర్ పోస్ట్ కావాలంటే అడగండి మంజూరి చేస్తామని చెప్పడం విచిత్రంగా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ మెమో ను రద్దు చేయకుండా క్లారిఫికేషన్ ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ అనాలోచిత, అసమర్థ ఉత్తర్వులు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా తెలుగు, హిందీ భాషా అధ్యాపకులు, సాహితీ వేత్తలు, సాహితి అభిమానులు మరియు TIPS సభ్యులు 12.07.2021 వ తేదీ సోమవారం నాడు ఇంటర్మీడియట్ విద్యా కమీషనర్ కార్యాలయంలో ఈ అంశంపై నిరసన తెలుపడానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ తొందరపాటు ఉత్తర్వులపై పునరాలోచించి తక్షణమే రద్దు చేయకుంటే అక్కడనే మెరుపు ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందని TIGLA & TIPS సంఘ నాయకులు పేర్కొన్నారు