Home > UNCATEGORY > ఇంటర్ డైరెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన టిగ్లా

ఇంటర్ డైరెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన టిగ్లా

BIKKI NEWS (APR. 26) : TIGLA THANKFUL TO INTERMEDIATE DIRECTOR KRISHNA ADITHYA. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తెలుగు భాషకు ప్రత్యామ్నాయంగా సంస్కృతం ప్రవేశపెడుతున్నట్లు గత కొద్దికాలంగా వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమైనవని రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి జయప్రదబాయి గారు విడుదల చేసిన అధికారిక ప్రకటనను టిగ్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ నయీమ్ పాషా గారు హర్షంతో స్వాగతించారు.

TIGLA THANKFUL TO INTERMEDIATE DIRECTOR KRISHNA ADITHYA.

తెలుగు భాషాభిమానులు మరియు అధ్యాపకుల్లో కలిగిన ఆందోళనలకు ముగింపు పలికినందుకు ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య గారిని మరియు రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి జయప్రదబాయి గారిని నయీమ్ పాషా గారు ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

తెలుగు మాతృభాషగా వెలుగొందుతూ, తేజస్సుతో పరచుకుంటున్న గొప్ప భాష. “దేశ భాషలందు తెలుగు లెస్స” అని మహాకవి శ్రీ కృష్ణదేవరాయలు ప్రశంసించిన ఈ అమూల్య భాష పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుండటంతో భవిష్యత్తు తరాలకు గొప్ప భాషా వారసత్వం అందుబాటులో ఉంటుందని నయీమ్ పాషా గారు పేర్కొన్నారు.

తెలుగు భాషకు ఎనలేని సాహిత్య వారసత్వం, మాధుర్యం, శాస్త్రీయ ప్రాముఖ్యత ఉంది. ఇటువంటి భాషాభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉండటం హర్షణీయం అని పేర్కొన్నారు.

అనవసర సందేహాలకు తావులేకుండా స్పష్టతను ఇచ్చిన అధికారులందరికీ టిగ్లా సంస్థ తరపున అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు TIGLA రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి సుధారాణి గారు, తెలుగు అధ్యాపకులు మోదుగు వెంకట్ మరియు శ్రీమతి ఉమలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు