DIEO పోస్టులను మంజూరు చేసి, ప్రిన్సిపాల్ పదోన్నతులు కల్పించాలంటూ TIGLA విజ్ఞప్తి

BIKKI NEWS (MAY 08) : TIGLA Requested bro sanction various posts in intermediate education. రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఖాళీగా ఉన్న పలు కీలక పోస్టులను మంజూరు చేయడం మరియు పదోన్నతుల ద్వారా నింపాలని ఇంటర్మీడియట్ డైరెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య కు తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.

TIGLA Requested bro sanction various posts in intermediate education

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న 62 ప్రధానాచార్యుల పోస్టులను పదోన్నతుల ద్వారా, ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న 26 DIEO ( కొత్తగా ఏర్పడిన జిల్లాలకు) పొస్టులను మంజూరు చేయించి పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరింది.

అదేవిధంగా ఖాళీగా ఉన్న ఒక అడిషనల్ డైరెక్టర్ పోస్టు, డిప్యూటీ డైరెక్టర్ పోస్టు ( అడ్మినిస్ట్రేషన్ ) రెండు అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరారు.

దీనివలన ప్రిన్సిపాల్స్ కు, అధ్యాపకులకు మేలు జరుగుతుందని తెలుపుతూ, ఈ ప్రక్రియను కళాశాలల పునఃప్రారంభం నాటికి పూర్తి చేయాలని కోరారు.

2021 ఫిబ్రవరి ప్రిన్సిపాల్స్ పదోన్నతుల తర్వాత వివిధ కారణాల దృష్ట్యా నేటివరకు ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్ పోస్టులకు పదోన్నతులు జరగలేదు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 24 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నేటి వరకు ఎటువంటి పోస్టులు మంజూరు కాలేదు. కావున కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపల్ మరియు సిబ్బంది పోస్టులను వీలైనంత త్వరగా ప్రభుత్వంచే మంజూరు చేయించగలరని తమరికి విన్నవించారు. దీనివలన ఈ విద్యా సంవత్సరం ఆయా కొత్త కళాశాలలో అడ్మిషన్లు పెరిగి ఇంటర్మీడియట్ వ్యవస్థ ఇంకా బలోపేతం అవుతుందని తెలిపారు..

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు