ఇంటర్మీడియట్ బోర్డులో దొంగలు పడ్డారు – TIGLA

దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో విద్యార్థులను తయారు చేస్తున్న తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు లో దొంగలు పడ్డారని, కొంత మంది అవినీతి పరులైన అధికారులు ఒక “కోటరీ”గా ఏర్పడి తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రతిష్టను దిగజారుస్తున్నారని పేర్కోంటూ అలాగే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఉన్న డీఐఈవోల, ప్రిన్సిపాల్ లు, నాన్ టీచింగ్, రెగ్యులర్, కాంట్రాక్టు, గెస్ట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ ఈ రోజు నిరసన కార్యక్రమం ఇంటర్మీడియట్ కమీషనరేట్ ఆవరణలో తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం (TIGLA) ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ బోర్డ్ లో అక్రమంగా బదిలీలు పదోన్నతులు పొందిన అధికారులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

TIGLA JANGAIAH SPEECH
  • జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్స్ గా, ప్రిన్సిపాల్ DIEO లుగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
  • అలాగే నాన్ టీచింగ్ సిబ్బందికి లైబ్రరేయన్ గా, జూనియర్ లెక్చరర్స్ గా పదోన్నతులు కల్పించాలని తెలిపారు.
  • కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు వెంటనే కేసీఆర్ హమీ మేరకు బదిలీలు చేపట్టాలని తెలిపారు.
  • అతిథి అధ్యాపకులు వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
  • ఎంటీఎస్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి.
  • ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.

ఈ TIGLA నిరసన ఈ కార్యక్రమానికి రెగ్యులర్ టీచింగ్ నాన్-టీచింగ్ అధ్యాపక సంఘాలు, కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల సంఘాలు, అతిథి అధ్యాపకుల సంఘాలు మద్దతు తెలిపాయి.

TIGLA R.K. GOUD SPEECH
Follow Us@