విద్యా శాఖ మంత్రిని కలిసిన TIGLA అధ్యక్షుడు జంగయ్య

నూతన సంవత్సరం మరియు చదువుల తల్లి సావిత్రి బాయి పూలే జన్మదిన సందర్భంగా విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డిని తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (TIGLA) అధ్యక్షుడు జంగయ్య ఆధ్వర్యంలో రమణ కుమారి, అంజయ్య, పరశురాం లు మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా

  • జూనియర్ అధ్యాపకుల ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ లిస్టు త్వరగా పూర్తి చేసి, అర్హత గల అధ్యాపకులకు వెంటనే ప్రిన్సిపల్ ప్రమోషన్స్ ఇవ్వాలని కోరడం జరిగింది.
  • ఆరవ జోను (ఆర్ జె డి ఐ ఈ ) కార్యాలయం హైదరాబాద్ కు మార్చాలని కోరడం.
  • కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు వెంటనే విడుదల చేయాలని కోరడం జరిగింది.

పై విషయాల అన్నింటిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సానుకూలంగా స్పందించడం జరిగిందని TIGLA రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య తెలిపారు.

Follow Us@