BIKKI NEWS (APR. 11) : TIGLA demanding for Telugu as a compulsory Language upto intermediate.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంస్కృతం చదువుతున్న/ ఆసక్తి ఉన్న విద్యార్థుల వివరాల గురించి సంస్కృత పోస్టుల ఆవశ్యకత గురించి తెలియజేయాలని జూనియర్ కళాశాలల ప్రధానాచార్యులను & జిల్లా అధికారులను ఇంటర్మీడియట్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వారు కోరుతూ సర్కులర్ జారీ చేసిన సంగతి మనకు విధితమే.
TIGLA demanding for Telugu as a compulsory Language upto intermediate.
ఈ విధంగా అడగడం వలన తెలుగు బోధిస్తున్న అధ్యాపకులు మరియు తెలుగు భాషాభిమానులు ఆందోళనకు గురవుతున్నారని టిగ్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నయీమ్ పాషా తెలియజేశారు. కేవలం మార్కుల కోసమే సంస్కృతాన్ని ప్రైవేటు కళాశాలలు ప్రోత్సహిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమని గుర్తు చేస్తూ విద్యార్థులకు నిజజీవితంలో ఆ భాష వలన ఎటువంటి ఉపయోగం ఉండదని జనజీవనంలో ఎక్కడా ఉపయోగించని భాషని విద్యార్ధులపై ఎలా రుద్దుతారని ప్రశ్నించారు.
కేవలం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే తెలుగు ద్వితీయ భాషగా మనుగడ సాగిస్తుందని ఇప్పుడు సంస్కృతాన్ని పూర్తిస్థాయిలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ భాషగా ప్రవేశపెడితే విద్యార్థులు మార్కుల కోసం తెలుగును కాదని సంస్కృత భాషను తీసుకుంటారని దీనివలన అంతంతమాత్రంగా విద్యార్థులలో ఉన్న తెలుగు భాషా సామర్థ్యం భవిష్యత్తులో మరుగున పడుతుందని కేవలం పత్రికలకే తెలుగు భాష పరిమితమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి సంస్కృతం విషయాన్ని తెరపైకి తెస్తూ అనవసరమైన ఆందోళనలను సృష్టిస్తున్నారని గతంలో ఇదే విషయంపై తెలుగు భాషా సంఘాలు, అధ్యాపక సంఘాలు, విద్యార్థులు ఆందోళన బాట పట్టగా అప్పటి ప్రభుత్వం ఆ ఆలోచన విరమించుకుందని గుర్తు చేశారు.
పదవ తరగతి వరకు బోధించని భాష, డిగ్రీలో ఉండని భాషను ఇంటెర్మీడియేట్ లో ప్రవేశపెట్టడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదని, జనజీవనంలో ఉపయోగించని భాషను ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశపెట్టే ఆలోచనని ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు.
అదే విధంగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా మాతృభాష అయిన తెలుగును పరిరక్షించుకోవడానికి అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తెలుగును తప్పనిసరి చేయాలని డిమాండ్ చేస్తున్నామని టిగ్లా అధ్యక్ష కార్యదర్శులు మైలారం జంగయ్య, నయీమ్ పాషా తెలియజేశారు.
ఇప్పటికే విద్యార్థులు ఆంగ్లం మోజులో పడి పూర్తి స్థాయిలో తెలుగు మాట్లాడడానికే ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగును బోధిస్తూ అమ్మ భాష పట్ల విద్యార్థులకు కనీస మమకారాన్ని కలిగిస్తున్న తరుణంలో ఇటువంటి ఆలోచనలు తగవని ప్రభుత్వ కళాశాలలో సంస్కృతాన్ని పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టే ఆలోచన విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంటర్ వరకు తెలుగును తప్పనిసరి చేయాలని గత ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసి దానిని బుట్ట దాఖలు చేసిందని కనీసం ప్రస్తుత ప్రభుత్వమైనా ఇంటర్ వరకు తెలుగును తప్పని సరి చేసి మాతృభాషకు న్యాయం చేయాలని “తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం”(టిగ్లా) డిమాండ్ చేస్తుంది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్